అంతర్జాతీయం

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధనౌక గస్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 30: చైనా, తైవాన్, వియత్నాంలు తమదిగా చెప్పుకొంటున్న వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌక గస్తీ నిర్వహించింది. అమెరికా, ఇతర దేశాల హక్కులు, స్వేచ్ఛలను పరిమితం చేసే మితిమీరిన సముద్ర జలాల హక్కులను సవాలు చేయడానికి అమెరికా ఈ గస్తీని నిర్వహించింది.
ప్రధానంగా చైనాను ఉద్దేశించి జరిపిన ఈ నేవిగేషన్ ఆపరేషన్ కథనాన్ని మొట్టమొదట ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక తెలియజేసింది. ‘చైనా, మరో రెండు పొరుగుదేశాలు తనదిగా చెప్పుకొంటున్న దక్షిణ చైనా సముద్రంలోని ఒక దీవి చుట్టుపక్కల అమెరికాకు చెందిన ఒక యుద్ధ నౌక శనివారం గస్తీ నిర్వహించింది. ఈ ప్రాంతంలోని సముద్ర జలాలు, భూభాగాలపై హక్కులకు సంబంధించి చైనా ప్రభుత్వం చేస్తున్న వాదనలను సవాలు చేయడానికి అమెరికా జరుపుతున్న ఆపరేషన్లలో ఇది మరొకటి’ అని ఆ పత్రిక తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో తాను జరిపిన ఆపరేషన్‌ను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సైతం ధ్రువీకరించింది. జనవరి 30న దక్షిణ చైనా సముద్రంలో ప్రత్యేకించి పారాసెల్ దీవుల్లోని ట్రిటాన్ దీవి చుట్టుపక్కల అమెరికా రక్షణ శాఖ నేవిగేషన్ స్వేచ్ఛా ఆపరేషన్‌ను నిర్వహించిందని తాను ధ్రువీకరించగలనని పెంటగాన్ ప్రతినిధి కమాండర్ బిల్ అర్బన్ పిటిఐ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఆపరేషన్‌లో భాగంగా యుఎస్‌ఎస్ కుర్టిస్ విల్బర్ ట్రిటన్ ఐలాండ్‌కు 12 నాటికల్ మైళ్ల దూరంలోని ఎవరికీ చెందని మార్గంలో గస్తీ నిర్వహించిందని ఉర్బన్ చెప్తూ, అమెరికా, తదితర దేశాల హక్కులు, స్వేచ్ఛలను పరిమితం చేస్తున్న మారిటైమ్ హక్కులను సవాలు చేయడానికే ఈ ఆపరేషన్ జరిపినట్లు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ సమయంలో ఆ ప్రాంతంలో చైనా సైన్యం లేదా నేవీ కనిపించలేదని ఆ పత్రిక తెలిపింది. ప్రతిస్పందనకు సంబంధించి అసాధారణమైనదేదీ తమకు కనిపించలేదని రక్షణ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. అంతర్జాతీయ చట్టాలు అనుమతించే ఎక్కడైనా సరే అమెరికా విమానాలు, నౌకలు ప్రయాణిస్తాయని, అమెరికా తన కార్యకలాపాలు నిర్వహిస్తుందని అధ్యక్షుడు బరాక్ ఒబామా, రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ చెప్పినదాన్ని ఈ ఆపరేషన్ నిరూపించిందని అర్బన్ చెప్పారు.