జాతీయ వార్తలు

సేంద్రీయానికి రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: సేంద్రీయ ఎరువులు, జీవ ఎరువులకు రాయితీలు ఇస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించారు. అనంతకుమార్ మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సభ్యుడు కొండా విశే్వశ్వర్ రెడ్డి అడిగిన ఒక అనుబంధ ప్రశ్నకు బదులిస్తూ సేంద్రీయ, జీవ ఎరువులను ఎరువులుగా గుర్తించటంతోపాటు రైతులు వీటిని విరివిగా ఉపయోగించేందుకు గాను రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అనంతకుమార్ చెప్పారు. రసాయన ఎరువుల ధర టన్నుకు 5,360 రూపాయలుంటే సేంద్రీయ, జీవ ఎరువుల ధర టన్నుకు ఐదువేల ఐదు వందల నుండి ఆరు వేల రూపాయల వరకు ఉన్నదని కేంద్ర మంత్రి వివరించారు. సేంద్రీయ ఎరువుల ధరలు అధికంగా ఉంటే రైతులెవ్వరు కూడా వీటిని ఉపయోగించేందుకు ముందుకు రారని ఆయన చెప్పారు. సేంద్రీయ ఎరువుల ధరలు రసాయన ఎరువుల ధరలతో సమానంగా ఉండేలా చూసేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న విశే్వశ్వరరెడ్డి వాదనతో మంత్రి అనంతకుమార్ ఏకీభవించారు. సేంద్రీయ ఎరువుల ధరలు రసాయన ఎరువులతో సమానంగా ఉండేలా చూసేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వటంతోపాటు అవసరమైన ఇతర అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన లోక్‌సభలో ప్రకటించారు. సేంద్రీయ, జీవ ఎరువులను ఎరువులుగా ప్రకటిస్తే జైలుకు పంపిస్తామని ఎరువుల కంపెనీలు బెదిరిస్తున్నాయి, దీనిని అదుపు చేయాలని విశే్వశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. సేంద్రీయ, జీవ ఎరువులను కూడా ఎరువులుగా ప్రకటించాలన్న ఆయన డిమాండ్‌ను అనంతకుమార్ ఆమోదించారు. సేంద్రీయ, జీవ ఎరువులకు ఎరువులుగా గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అనంతకుమార్ ప్రకటించారు. సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని అనంతకుమార్ చెప్పారు. దేశంలోని పెద్ద పట్టణాల్లో ఉత్పత్తి అయ్యే చెత్త ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేసేందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో కలిసి చెత్త నుండి కంపోజిట్ ఎరువుగా మార్చే ప్రక్రియను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశే్వశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎరువులంటే కేవలం రసాయన ఎరువులు కాదు, సేంద్రీయ, జీవ ఎరువులు కూడా ఎరువులేనని సూచించారు. సేంద్రీయ ఎరువులకు ఎరువులుగా ముద్ర వేయటం మంచిది కాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సేంద్రీయ ఎరువుల ఉపయోగం ఆరోగ్యానికి ఎంతో మంచిదనీ, దీనితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని విశే్వశ్వర రెడ్డి సూచించారు.