జాతీయ వార్తలు

ఎందుకీ జాప్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: ఇంటర్నెట్ తటస్థత (నెట్ న్యూట్రాలిటి) అంశంపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తరచుగా చర్చల నెపంతో ఇంటర్నెట్ తటస్థతపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం అంటే అర్థం పెద్ద కార్పొరేషన్ల నియంత్రణలో ఉన్న ఇంటర్నెట్ కాదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఇంటర్నెట్ స్వేచ్ఛ, ఇంటర్నెట్ తటస్థతకోసం నిలబడుతుందని రాహుల్ గాంధీ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌లోని అన్ని రకాల డేటాలను సమదృష్టితో చూడాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను, టెలికం సర్వీస్ ప్రొవైడర్లను, ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరిందని ఆయన వెల్లడించారు. ‘డిజిటల్ ఇండియాతో ప్రజలకు ఇంటర్నెంట్ మరింతగా అందుబాటులోకి వస్తుంది. మొత్తం ఇంటర్నెట్ వస్తుంది. వడపోసి ఎంపికచేసిన కొన్ని ప్రాథమిక సైట్లు కావు. భారత్ 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందడానికి ఇది ఎంతయినా అవసరం. లక్షలాది మంది భారతీయులతో పెనవేసుకుపోయిన ఇంటర్నెట్ తటస్థతను కాపాడడానికి ట్రాయి నివేదిక, మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజల వినియోగంకోసం ఇంటర్నెట్ అనే విధంగా డిజిటల్ ఇండియా ఉండాలని ఆయన ప్రధానికి హితవు పలికారు. ఇంటర్నెట్ వినియోగదారులు తమకు ఇష్టం వచ్చిన వెబ్‌సైట్లను, సర్వీస్‌లను పొందే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ‘వరల్డ్ వైడ్ వెబ్’పై అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలని సూచించారు. ఒక కొత్త డిజిటల్ డివైడ్‌ను సృష్టిస్తూ పబ్లిక్ ఇంటర్నెట్‌పై ప్రైవేటు ప్లాట్‌ఫామ్‌కు ప్రత్యేక హక్కులను కల్పించే ప్రమాదం పొంచి ఉన్నట్లు తాము గుర్తించామని రాహుల్ గాంధీ తెలిపారు. పేదరిక నిర్మూలనకు ఒక శక్తివంతమైన ఆయుధం ఇంటర్నెట్ అనే విషయాన్ని గుర్తించాలని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు.

వైమానిక కేంద్రాల్లో
మరింత భద్రత
తనిఖీలు పూర్తిచేసిన ఐఏఎఫ్
న్యూఢిల్లీ, జనవరి 31: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి తర్వాత భారత వైమానిక దళం (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 950 ఫైయింగ్, నాన్‌ఫ్లైయింగ్ బేస్‌లలో సెక్యూరిటీ ఆడిట్‌ను చేపట్టి పూర్తి చేసింది. అంతేకాకుండా మరికొంతమంది గరుడ్ కమాండోలను నియమించుకోవడానికి రక్షణ శాఖ అనుమతిని కోరవచ్చని తెలుస్తోంది. పఠాన్‌కోట్ దాడి జరిగిన తర్వాత ఆదేశించిన సెక్యూరిటీ ఆడిట్‌లో భద్రతాపరంగా కొన్ని లోపాలను గుర్తించారని, వాటిని పూడ్చడానికి చర్యలు తీసుకుంటారని ఐఏఎఫ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రిటైరయిన సైనికులతో ఏర్పాటు చేసిన డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ స్థానంలో ఇతర భద్రతా సిబ్బందిని నియమిస్తారా అని అడగ్గా, తమ బేస్‌లలో ఇప్పటికే గరుడ్ కమాండోలు ఉన్నారని, అవసరమైతే మరింత మందిని నియమిస్తామని ఆ అధికారి చెప్పారు. ఇకపై కూడా డిఎస్‌సి సిబ్బంది, గరుడ్ కమాండోలు కలిసి తమ ఎయిర్‌బేస్‌ల బాధ్యతను చూస్తారని స్పష్టం చేశారు. సెక్యూరిటీలో లోపాలను గుర్తించడం పూర్తయిందని, తదుపరి చర్య వాటిని పరీక్షించడమేనని ఆయన చెప్పారు.
భారత వైమానిక దళానికి నిర్దేశిత అంతర్గత సామర్థ్యాలను అందించడానికి వైమానిక దళంలో ప్రత్యేక దళమైన ‘గరుడ్’ను 2003లో ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ఎయిర్‌బేస్‌లలో క్విక్ రియాక్షన్ దళంగా ఉండే విధంగా, వైమానిక దళానికి చెందిన అత్యంత విలువైన ఆస్తులను కాపాడడానికి, శాంతి, యుద్ధ సమయాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపట్టడానికి, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ప్రత్యేక మిషన్ బాధ్యతలు నిర్వించడానికి అనువైన శిక్షణను ఈ కమాండోలకు ఇస్తారు. త్రివిధ దళాల్లోని ఆయా విభాగాలు విడివిడిగా జరిపే సెక్యూరిటీ ఆడిట్‌తోపాటుగా రిస్క్ అంశం ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా దళాల స్థావరాలన్నిటిలోను భద్రతను సమీక్షించడానికి ఒక కమిటీని నియమించే ప్రక్రియలో రక్షణ మంత్రిత్వ శాఖ ఉంది. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ బృందం బేస్‌లను సందర్శించి రిస్క్ అంశం, సున్నితత్వం, ఆస్తులు లాంటి ప్రాధాన్యతలను పరిశీలించడంతో పాటుగా స్థానిక కమాండోలతో చర్చిస్తుందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ నెల 21న చెప్పడం తెలిసిందే.