జాతీయ వార్తలు

అడుగడుగునా అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డంకులను సృష్టిస్తోందని బిజెపి ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. విపక్షం అడుగడుగునా అడ్డుతుగులుతున్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో సమర్థవంతంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆ పార్టీ పేర్కొంది. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవడాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందని, అందుకే ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై పదే పదే విషప్రచారం సాగిస్తోందని బిజెపి విమర్శించింది. ‘దేశ అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ మోదీ అద్భుత ఫలితాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మోదీ నాయకత్వ ప్రతిభను, భారత దేశ అభివృద్ధి గాథను ప్రపంచ నాయకులంతా ఒకవైపు ముక్తకంఠంతో ప్రశంసిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఆయనపై విషప్రచారాన్ని సాగిస్తూ సంకుచిత రాజకీయాలు చేస్తున్నారు’ అని బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఆరోపించారు. గత ఏడాది పార్లమెంట్ సమావేశాలను స్తంభిపజేసి కీలక బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ దేశంలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించినప్పటికీ ప్రధాని మోదీ అద్భుత ఫలితాలను సాధించగలిగారని ఆయన అన్నారు. న్యాయస్థానాల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్ శర్మ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లలో అక్కడి ముఖ్యమంత్రులు ఊమెన్ చాందీ, వీరభద్ర సింగ్ అవినీతి ఊబిలో కూరుకుపోయారని, వారి గురించి పల్లెత్తు మాట మాట్లాడని కాంగ్రెస్ పార్టీ మోదీ సహా బిజెపి నాయకుల వైపు వేలెత్తి చూపడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.