జాతీయ వార్తలు

ముఫ్తీ విజన్‌ను అమలుచేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 31: జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు ఎలాంటి విముఖత లేదని, అయితే దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ విజన్‌ను పూర్తి చేయడానికి మిత్రపక్షమైన బిజెపి నుంచి గట్టి హామీ లభించేంత వరకు ఇది సాధ్యం కాదని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆదివారం తన పార్టీ కోర్ గ్రూప్‌కు చెప్పారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ కోర్ గ్రూప్ సమావేశానికి అధ్యక్షత వహించిన మెహబూబా మాట్లాడుతూ ముఫ్తీ మహమ్మద్ సరుూద్ విజన్ అయిన రాష్ట్రంలో సమాన అభివృద్ధి, శాంతియుత పరిస్థితులను సాధించడానికి కూటమి భాగస్వామి అయిన బిజెపి నుంచి గట్టి హామీ అవసరమని పేర్కొన్నట్లు ఆ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ప్రజలలోకి పార్టీని తీసికెళ్లడం వంటి అంశాలపై చర్చించడానికి కోర్‌గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని, అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ అభిప్రాయాన్ని తెలపాలని కొంతమంది ఎమ్మెల్యేలు మెహబూబాను కోరగా, ఆమె పైవిధంగా సమాధానం ఇచ్చారని ఒక నాయకుడు చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి విముఖత లేనప్పటికీ ఏమీ సాధించకుండా చేతులు కాల్చుకోబోనని ఆమె కోర్ గ్రూప్ నాయకులకు వివరించారు. ముఫ్తీ మహమ్మద్ సరుూద్ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఓ పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారని, కాని ఆయన కన్న కలలు చాలామట్టుకు నెరవేరకుండా మిగిలిపోయాయని మెహబూబా చెప్పారని ఆ నాయకుడు తెలిపారు.
కేవలం తాను ముఖ్యమంత్రిని కావడానికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోనని మెహబూబా స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. ఆదివారం నాటి పిడిపి కోర్ గ్రూప్ సమావేశం వివరాలను బట్టి చూస్తే జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుందని స్పష్టమవుతోంది. జనవరి 7న ముఫ్తీ మహమ్మద్ సరుూద్ మృతి చెందడంతో 8న జమ్మూకాశ్మీర్‌లో రాష్టప్రతి పాలన విధించిన విషయం తెలిసిందే.
చిత్రం... శ్రీనగర్‌లో ఆదివారం సమావేశమైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ కోర్ గ్రూప్