జాతీయ వార్తలు

ప్రైవేటు సెక్టార్‌లో రిజర్వేషన్లుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 1: ప్రైవేటు సెక్టారులో కూడా రిజర్వేషన్లు అమలుచేయాలని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ప్రభుత్వ ఫలాలు అందుకుంటున్న ప్రైవేటు కంపెనీలు దళితులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం వుందని తమ పార్టీ అభిప్రాయపడుతోందని ఆయన చెప్పారు. అలాగే రానున్న బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన షెడ్యూలు కులాలు, తెగల వారికి తగినన్ని నిధులు కేటాయించాలని అన్నారు. అలాగే వెనుకబడిన వర్గాల వారికి న్యాయ వ్యవస్థలోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దళితుల ప్రయోజనాలకు కట్టుబటివుందని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తికావస్తున్న సందర్భంగా సోమవారం ఆయన మహారాష్టల్రోని ఔరంగాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, పంటల బీమా తదితర పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయని ఆయన అన్నారు. బిహార్‌లోని నితిశ్ కుమార్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, ‘బిహార్‌లో జంగిల్ రాజ్యం తిరిగి ప్రారంభమైందని’ వ్యాఖ్యానించారు.

మయన్మార్‌లో మొదలైన
పార్లమెంట్ సమావేశాలు
ఉత్సాహంగా హాజరైన ఎంపీలు
సూకీ పార్టీకి చారిత్రక మలుపు
నెపిట్వా (మయన్మార్), ఫిబ్రవరి 1: ఐదు దశాబ్దాలు పైగా సాగిన సుదీర్ఘ సైనిక పాలన తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కొలువుదీరబోతున్న మయన్మార్‌లో సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరిలో అత్యధికులు ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డి (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ) పార్టీకి చెందినవారే ఉన్నారు. సైనిక పాలనలో ఎన్నో ఏళ్లపాటు అణచివేతకు గురైన ఎన్‌ఎల్‌డిని ఈ సమావేశాల్లో చారిత్రాత్మక మలుపు తిప్పబోతున్నాయి. మయన్మార్ పార్లమెంట్ ఉభయ సభలకు గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి 80శాతం సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అర్హత సాధించిది. సైనిక జనరల్ నుంచి సంస్కర్తగా మారిన అధ్యక్షుడు థెయిన్ సెయిన్ నేతృత్వంలో నామమాత్రపు ప్రజాప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించేందుకు 2011లో సైనిక పాలకులు అన్యమనస్కంగా అంగీకరించడంతో నియంతృత్వ పాలన నుంచి మయన్మార్ ప్రజాస్వామ్య పాలన దిశగా అడుగులు ప్రారంభించింది. మార్చి నెలాఖరులోనో లేక ఏప్రిల్ ఆరంభంలోనో ఎన్‌ఎల్‌డి అభ్యర్థి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే థెయిన్ సెయిన్ గద్దె దిగుతారు. మయన్మార్ అధ్యక్ష పదవి చేపట్టకుండా ఆంగ్‌సాన్ సూకీపై రాజ్యాంగపరమైన నిషేధం విధించడంతో ఎన్‌ఎల్‌డికి చెందిన మరొకరిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టి పరోక్షంగా పరిపాలన సాగించాలని ఆమె నిశ్చయించుకున్నారు. అయితే ఎవరిని నామినేట్ చేయబోతోందో ఆమె ప్రకటించలేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి ఘనవిజయం సాధించినప్పటికీ ప్రభుత్వంలో ఆ పార్టీ సైనిక దళంతో కలసి అధికారాన్ని పంచుకోవాల్సి ఉంది. ఇందుకోసం రాజ్యాంగం పార్లమెంట్‌లో 25 శాతం సీట్లను రిజర్వు చేసింది.

అద్దె తల్లులకూ
ప్రసూతి సెలవులు
ముంబయి, ఫిబ్రవరి 1: ఉద్యోగాలు చేస్తున్న అద్దె తల్లుల (సరోగసీ)కు ఆరు నెలల ప్రసూతి సెలవులు మంజూరుకు బాంబే హైకోర్టు ఆదేశించింది. చైల్డ్ అడాప్షన్ లీవ్, రూల్స్ 551(సి),(సి) సెక్షన్ల కింద న్యాయస్థానం ఆ మేరకు స్పష్టం చేసింది. సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అనూప్ మొహ్తా, జస్టిస్ జిఎస్ కులకర్ణి జనవరి 29న తీర్పును వెలువరించింది. సరోగసీ తల్లికి ఆరునెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతోపాటు తాత్కాలిక భృతి ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తనకూ ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని మహిళ చేసుకున్న దరఖాస్తును మధ్యరైల్వే తిరస్కరించింది. అద్దె తల్లులకు ప్రసూతి సెలవులు మంజూరుకు చట్టపరంగా ఎలాంటి అధికారాలు లేవని సంస్థ పేర్కొంది. దీంతో ఆమె బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. కాగా 2004లో వివాహమైన ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో సరోగసీని ఆశ్రయించింది. 33 వారాలు ముగిసిన తరువాత తనకూ సెలవులు, భృతి మంజూరు చేయాలని మధ్యరైల్వేను ఆశ్రయించింది.
పిటిషనర్ తరువాత సందీప్ షిండే, టాన్యా గోస్వామి హైకోర్టులో వాదనలు వినిపించారు.

నన్ను పావుగా వాడుకున్నారు: సోలార్ సరిత ఆరోపణ

తిరువనంతపురం, ఫిబ్రవరి 1: కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ రాజకీయ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోమవారం ఇక్కడ జుడీషియల్ కమిషన్ ఎదుట హాజరైన సరిత రాజకీయ నాయకులంతా తనను పావుగా వాడుకున్నారని తెలిపింది. సోలార్ కుంభకోణానికి సంబంధించిన తన వద్ద ఉన్న సిడిలు, డాక్యుమెంట్లను సరిత కమిషన్‌కు అందచేశారు. విచారణ తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె రాజకీయ నాయకులు తనను అన్ని విధాలుగా వాడుకున్నారని ఆరోపించింది. ‘కుంభకోణానికి సంబంధించి ఆడియో, వీడియో టేపులు కమిషన్‌కు అందజేశాను. కాంగ్రెస్ నేత తంపనూర్ రవి, లెజిస్లేటర్ బినె్న బెహమన్, ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాజీ సెక్యూరిటీ గార్డు సలీమ్ రాజ్, వ్యాపారి అబ్రహాం కల్లీమనె్నల్‌తో నేను జరిపిన ఫోన్ సంభాషణలు అందులో ఉన్నాయి’ అని సరితానాయర్ పేర్కొన్నారు.