జాతీయ వార్తలు

సాటిలేని కోస్ట్‌గార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: తీరప్రాంత రక్షణలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ అంకితభావంతో పనిచేస్తోంది. పొరుగుదేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా తిప్పికొడుతూ జాతి ప్రయోజనాల కోసం శ్లాఘనీయమైన పాత్ర పోషిస్తోంది. నాలుగు దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన ఇండియన్ కోస్ట్‌గార్డ్ జాతి ప్రయోజనానలు కాపాడడంతో ముందుంటోంది. ఆధునికీకరణ విషయంలో మిగతా పారామిలటరీ దళాలకంటే వెనుకబడి ఉన్నప్పటికీ తీర ప్రాంత రక్షణలో అకుంఠిత దీక్షతో పనిచేస్తోంది. 10,440 మంది సిబ్బంది కోస్ట్‌గార్డ్‌లో సేవలందిస్తున్నారు. నావికాదళం, స్థానిక పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తూ సమన్వయంతో పనిచేస్తున్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇండియన్ కోస్ట్‌గర్డ్ పాలుపంచుకుంటోంది. తీర ప్రాంతం వెంబడి వ్యూహాత్మక స్థావరాలను కంటికిరెప్పలా కాపాడుతోంది. 1977 ఫిబ్రవరి 1న ఆవిర్భవించిన సంస్థ శత్రుదేశాల ఎత్తులు పారనీయకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తోంది. 26/11 ముంబయిపై ఉగ్రవాద దాడి తరువాత సంస్థ బాధ్యతలు మరింత పెరిగాయి. ఈ మేరకు కోస్ట్‌గార్డ్ ఆధునికీకరణ, విస్తరణ కోసం కేంద్రం కార్యాచరణ చేపట్టింది.
అయితే వాటిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమాండర్ (రిటైర్డ్) ఉదయ్ చిట్నవీస్ స్పష్టం చేశారు. తీర ప్రాంత రక్షణ విషయంలో కోస్ట్‌గార్డ్ అంకితభావాన్ని తక్కువగా అంచనా వేయలేమని ఆయన అన్నారు. తీర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సముద్ర జలాల్లో చట్టవ్యతిరేక చర్యలకు అడ్డుకట్టవేయడంలో సంస్థ ముందుంది. 2008 నవంబర్ 26న ముంబయిపై ఉగ్రవాద దాడి తరువాత కోస్ట్‌గార్డ్‌ను బలోపేతం చేయడానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఆధునికీకరణ, విస్తరణకు చొరవ తీసుకుంది. దీన్లో భాగంగా 150 నౌకలు, వంద జంట ఇంజన్ల విమానాలు సమకూర్చుకోనున్నారు. 2020 నాటికి కోస్ట్‌గార్డ్‌ను ఓ బలమైన శక్తిగా రూపొందించాలని నిర్ణయించారు.