జాతీయ వార్తలు

ప్రభుత్వ ఏర్పాటుపై ఏమంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ/శ్రీనగర్, ఫిబ్రవరి 1: జమ్మూ-కాశ్మీరులో ప్రభుత్వ ఏర్పాటుపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), బిజెపిల వైఖరి ఏమిటో వివరించాలని, దీనిపై సంప్రదింపులు జరిపేందుకు మంగళవారం తనతో భేటీకి రావాలని రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్.వోహ్రా ఇరు పార్టీల అధినేతలను కోరారు. పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీని మంగళవారం సమావేశానికి రావలసిందిగా గవర్నర్ ఆహ్వానించిన మాట నిజమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి నరుూమ్ అక్తర్ సోమవారం పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై తనతో సంప్రదింపులు జరిపేందుకు రావలసిందిగా గవర్నర్ వోరా ఆదివారం రాత్రి ఫ్యాక్స్ ద్వారా సందేశాన్ని పంపారని అధికార వర్గాలు తెలిపాయి. మెహబూబా ముఫ్తీ మంగళవారం మధ్యాహ్నం వోరాతో భేటీ కావలసి ఉందని, ఆ తర్వాత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సత్పాల్ శర్మ గవర్నర్‌తో సమావేశమవుతారని అధికార వర్గాలు వివరించాయి. ‘అవును.. మంగళవారం సాయంత్రం మేము గవర్నర్‌ను కలవబోతున్నాం’ అని సత్పాల్ శర్మ తెలిపారు. కాగా, తదుపరి కార్యాచరణను నిర్ణయించుకునేందుకు బిజెపి కోర్ గ్రూపు సోమవారం తమ పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) అశోక్ కౌల్ నివాసంలో సమావేశమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కమలనాథులతో పొత్తు కొనసాగించాలా వద్దా? అనే విషయమై పిడిపి పునరాలోచన జరపాల్సి ఉందని మెహబూబా ముఫ్తీ స్పష్టం చేయడంతో బిజెపి కోర్ గ్రూపు ఈ సమావేశం జరిపింది. గవర్నర్ లేఖ నేపథ్యంలో సోమవారం పిడిపి కూడా తమ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వ ఏర్పాటుపై పిడిపి బిగదీసుకుని కూర్చోవడంతో ఆకస్మిక ఎన్నికలు జరగకుండా నిరోధించేందుకు గవర్నర్ చివరి ప్రయత్నంగా ఆ పార్టీతో పాటు బిజెపిని సంప్రదింపులకు రావలసిందిగా ఆహ్వానించినట్లు కనిపిస్తోంది.

పిడిపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న ఆ పార్టీ
సీనియర్ నేత నయామ్ అక్తర్

సత్ఫలితాలిస్తున్న ‘బేటీ బచావో’

మరో 61 జిల్లాలకు విస్తరిస్తాం * కేంద్ర మంత్రి మేనకా గాంధీ వెల్లడి

జైపూర్, ఫిబ్రవరి 1: ఎన్‌డిఎ ప్రభుత్వం 100 జిల్లాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకం విజయవంతమైందని, దీంతో ఈ పథకాన్ని మరో 61 జిల్లాలకు విస్తరించడం జరుగుతుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వెల్లడించారు. సోమవారం ఆమె జైపూర్‌లో అఖిల భారత ప్రాంతీయ సంపాదకుల సమావేశంలో ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి ఉద్భవించిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకాన్ని ప్రభుత్వం తొలి విడత 100 జిల్లాల్లో ప్రారంభించి ప్రోత్సాహకరమైన ఫలితాలను రాబట్టగలిగిందని, అందుకే మరో 61 జిల్లాలను ఈ పథకం పరిధిలోకి తీసుకొస్తున్నామని అన్నారు. మోదీ గత ఏడాది హర్యానాలోని సోనేపట్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోని కొన్ని జిల్లాల్లో పురుషుల కంటే స్ర్తిల సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో పరిస్థితిని మెరుగుపరిచేందుకు, అలాగే భ్రూణ హత్యలను నివారించి బాలికల్లో విద్యను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బాలికల పరిస్థితిని మెరుగుపరిచి, వారికి అవకాశాలను సృష్టించేందుకు మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండటంతో సమాజంలో మార్పు వస్తోందని మేనకా గాంధీ అన్నారు.