జాతీయ వార్తలు

ఆ భూమిని లాక్కోలేదు.. 20ఏళ్లు పోరాడితే వచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 1: రాజకీయ నాయకురాలిగా మారిన సినీనటి హేమమాలినికి డాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం భూమిని కేటాయించడంపై వివాదం క్రమేణా పెరుగుతోంది. అయితే ఈ భూమిని తానేమీ లాక్కోలేదని, దీని కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు. హేమమాలినికి చెందిన నృత్యవిహార్ కళాకేంద్ర చారిటీ ట్రస్టుకు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ముంబయి శివారు అంధేరీలోని అంబీవలిలో కారుచౌకగా రూ.70 వేలకే భూమిని కేటాయించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఇటీవల ధ్వజమెత్తడంతో ఆమె పైవిధంగా స్పందించారు. ‘ఈ భూమి కొనుగోలు కోసం నేను ఇప్పటివరకూ ఒక్కపైసా కూడా చెల్లించలేదు. దీనిపై ఊహాగానాలు ఎందుకు? ఏదిఏమైనా ఈ భూమి కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటా. దీని ధర ఎంత నిర్ణయిస్తే అంత చెల్లిస్తా. దీనిపై ఊహాగానాలు ఎందుకు? ఈ అంశాన్ని జాతీయ, అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరిస్తున్న వారికి కృతజ్ఞతలు. దయచేసి దీనిని రాజకీయ చేయొద్దు’ అని హేమమాలిని సోమవారం ముంబయిలో విలేఖర్లతో అన్నారు. ముంబయిలో నివసిస్తున్న తనకు ఈ డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటుచేసే హక్కు ఉందని, దీనిని సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. ఈ భూమిని తానేమీ లాక్కోలేదని, దీనిని పొందేందుకు 20 ఏళ్లపాటు పోరాడానని ఆమె చెప్పారు.