జాతీయ వార్తలు

‘ఉపాధి హామీ’ని అమలుచేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: జాతీయ ఆహార భద్రత, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చట్టాలను అమలు చేయని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గుజరాత్ వంటి రాష్ట్రం పార్లమెంటు ఆమోదించిన జాతీయ ఆహార భద్రత చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. ‘పార్లమెంటు ఏం చేస్తోంది? గుజరాత్ భారత్‌లో అంతర్భాగం కాదా? ఈ చట్టం భారతదేశం మొత్తానికి వర్తిస్తుందని ఈ చట్టంలోనే ఉంది. కాని, గుజరాత్ అమలు చేయడం లేదు. రేపు మరొకరు నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి), భారత శిక్షాస్మృతి (ఐపిసి), ఎవిడెన్స్ యాక్ట్‌లను అమలు చేయబోవడం లేదని చెప్పగలరు’ అని న్యాయమూర్తి మదన్ బి లోకుర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటయిన వ్యాఖ్యలు చేసింది. కరవు పీడిత రాష్ట్రాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జాతీయ ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాల అమలు స్థితిగతులపై సమాచారాన్ని సేకరించాలని కూడ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 10లోగా అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆ తరువాత మరో రెండు రోజులకు వాయిదా వేసింది. కరవు పీడిత ప్రాంతాల ప్రజలకు అవసరమైన కనీస ఉపాధి, ఆహారం అందుతోందా లేదా? అనేది తెలుసుకోవడానికి ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ, ఆహార భద్రత చట్టాల కింద గల పథకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు జనవరి 18న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దేశంలోని కరవు పీడిత ప్రాంతాలలో ప్రజలను ఆదుకోవడం లేదంటూ దాఖలయిన ఒక ప్రజాప్రయోజన పిటిషన్ (పిల్)ను విచారిస్తూ సోమవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, హర్యానా, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు కరవు బారిన పడినప్పటికీ, అధికారులు ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడం లేదని ఈ పిల్‌లో పేర్కొన్నారు. సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ స్వరాజ్ అభియాన్ ఈ పిల్‌ను దాఖలు చేసింది.