జాతీయ వార్తలు

మోదీ ఆస్తి కోటిన్నరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రాజకీయాల్లోకి వస్తే చాలు కోట్లకు పడగలెత్తుతున్న నేతల్ని చాలా మందిని చూస్తున్నాం! ఆస్తుల చిట్టా విప్పితే చాలు ఏళ్లు గడవక ముందే అమాంతం వందల రెట్లు పెరిగిపోయిన నేతల చిట్టాలకు కొదవ లేదు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ విషయంలో భిన్నం. హోదాయే తప్ప తనకు ఆస్తులూ ఎక్కువ లేవన్న విషయాన్ని ఆయన వెల్లడించిన తాజా లెక్కలే చెబుతున్నాయి. మోదీ వద్ద అందుబాటులో ఉన్న నగదు కేవలం 4700 రూపాయలే. ఆయన మొత్తం ఆస్తుల విలువ కోటి 41లక్షలు. ఇది కూడా పదమూడేళ్ల క్రితం ఆయన కొన్న ఆస్తి ఇప్పటివరకూ 25రెట్లు పెరగడం వల్ల వచ్చిందే! గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మోదీ వద్ద ఉన్న నగదు కేవలం 4700రూపాయలేనని అంతకు ముందు సంవత్సరంలో 38,700 రూపాయలని ప్రధాని కార్యాలయం తెలిపింది. మోదీ 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీకి ఎలాంటి మోటారు వాహనాలు, హెలిక్యాప్టర్లు, యాచ్‌లు, ఓడలు లేవు. మోదీ బ్యాంకు ఖాతాలు ఇప్పటికీ గుజరాత్‌లోనే ఉన్నాయి. ఆయనకు ఢిల్లీలో ఇప్పటికీ బ్యాంకు ఖాతా లేదు. మోదీకి ఎలాంటి రుణాలు లేవు. ఆయన చేతివేళ్లకు ఉన్న నాలుగు బంగారు ఉంగరాల మొత్తం బరువు 45 గ్రాములు కాగా, వీటి మొత్తం విలువ 2015 మార్చి 31నాటికి రూ.1.19 లక్షలు. 2014 ఆగస్టు 18న రూ.1.21 లక్షలు ఉన్న ఈ ఉంగరాల విలువ ఈ కాలంలో స్వల్పంగా తగ్గింది. 2016 జనవరి 30 వరకు మోదీకి ఉన్న ఆస్తులను ఈ తాజా వివరాలు వెల్లడిస్తున్నాయని పిఎంఒ వెబ్‌సైట్ తెలిపింది. మోదీకి ఉన్న మొత్తం చరాస్తుల విలువ రూ.41.15 లక్షలు. వీటిలో రూ.20వేల విలువ గల పెట్టుబడులున్నాయి. రూ.5.45 లక్షల విలువ గల జాతీయ పొదుపు పత్రాలు ఉన్నాయి. 1.99 లక్షల విలువ గల జీవిత బీమా పాలిసీలు ఉన్నాయి. గాంధీనగర్‌లో ఉన్న ఒక నివాసానికి సంబంధించిన ఆస్తిలో నాలుగో వంతు వాటా ఉంది. ఇందులో అతని వాటా విస్తీర్ణం 3,531.45 చదరపు అడుగులు. దీనిలో నిర్మాణ స్థలం 169.81 చదరపు అడుగులు. అయితే ఇది వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కాదు. మోదీ 2002 అక్టోబర్ 25న ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ భూమి కొనుగోలు ధర రూ.1,30,488 కాగా, దానిలో నిర్మాణాలకోసం చేసిన పెట్టుబడులు రూ.2,47,208. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ ఆస్తి విలువ సుమారు రూ.ఒక కోటి ఉంటుంది. ఈ 13ఏళ్లలో దీని విలువ 25 రెట్లకుపైగా పెరిగింది.