జాతీయ వార్తలు

నీకు బెయిలెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అంధ్రప్రదేశ్ కాల్‌మనీ రాకెట్ కేసులో నాల్గవ నిందితుడు, ట్రాన్స్‌కో ఉద్యోగి ఎం.సత్యానందంకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను ఎందుకు రద్దుచేయకూడదో వివరణ ఇవ్వాలని సత్యానందంకు నోటీసులు జారీచేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ సోమవారం న్యాయముర్తులు జస్టిస్ జగదీశ్ సింగ్ ఖెహర్, జస్టిస్ సి నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున్యాయవాది గుంటూరు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన సత్యానందం కొందరు వ్యక్తులతో కలిసి పెద్దఎత్తున కాల్‌మనీ నేరానికి పాల్పడ్డారని అన్నారు. సత్యానందంపై రేప్, గ్యాంగ్‌రేప్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు కోర్టుకు తెలిపారు. వెంటనే అతనికి వచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. సత్యానందంకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది.