జాతీయ వార్తలు

పదిమంది సైనికులు సజీవ సమాధి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హిమాలయాల్లోని సియాచిన్ హిమనదం ప్రాంతంలో పెద్ద ఎత్తున హిమపాతం కారణంగా ఎత్తయిన పర్వత శ్రేణుల్లోని ఈ భారతీయ సైనిక స్థావరం వద్ద కాపలా కాస్తున్న పది మంది సైనికులు మంచుకింద చిక్కుకు పోయినట్లు తెలుస్తోంది. ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జెఓసి) కూడా ఉన్న వీరంతా కూడా బిహార్ రెజిమెంట్ 19వ బెటాలియన్‌కు చెందిన వారని తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున లడఖ్ ప్రాంతంలో సుమారు 19 వేల అడుగుల ఎత్తులోని నార్తర్న్ గ్లేసియర్ సెక్టార్‌లో ఉన్న ఈ సైనిక స్థావరం వద్ద భారీ ఎత్తున మంచు కురిసినట్లు ఉధంపూర్‌లోని నార్తర్న్ కమాండ్ ప్రధాన స్థావరం వద్ద రక్షణ శాఖ పిఆర్‌ఓ కల్నల్ ఎస్‌డి గోస్వామి తెలియజేశారు. హిమపాతం విషయాన్ని గమనించని సైనికులు భారీ మొత్తంలో పడిన మంచు కింద చిక్కుపడిపోయారని ఆయన చెప్పారు. వారిని కాపాడడం కోసం సైన్యం, భారత వైమానిక దళం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ భూమి అయిన సియాచిన్ హిమనదం ప్రాంతంలో భారతీయ సైన్యం స్థావరం ఉంది. గత నెలలో కూడా ఈ ప్రాంతంలో ఇదే విధంగా హిమపాతం కారణంగా నలుగురు జవాన్లు మృతి చెందారు.