జాతీయ వార్తలు

కనిపిస్తే కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి తర్వాత పశ్చిమ సెక్టార్‌లోని అన్ని ఎయిర్‌బేస్‌ల వద్ద అనధికారికంగా లోనికి ప్రవేశించే వారిని కనిపించిన వెంటనే కాల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయినట్లు బుధవారం మీడియా కథనాలు పేర్కొన్నాయ. పశ్చిమ సెక్టార్‌లలోని అన్ని ఎయిబేస్‌లలోను అక్రమంగా చొరబడడానికి ప్రయత్నించే వారిపై కనిపిస్తే కాల్చివేయడానికి ఆదేశాలు జారీ అయినట్లు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అంతేకాదు, వెస్ట్రన్ కమాండ్‌లోని అన్ని ఎయిర్‌బేస్‌లు హైఅలర్ట్‌లో ఉన్నట్లు కూడా ఆ అధికారి చెప్పారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారని, సైన్యం, కేంద్ర పారా మిలిటరీ బలగాలు, క్విక్ యాక్షన్ ఫోర్స్‌లు క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా కవాతులు నిర్వహిస్తున్నాయని కథనాలు పేర్కొన్నాయి. అంతేకాదు బేస్‌లను భద్రంగా ఉంచడానికి అవసరమైన భద్రతా వ్యవస్థకోసం అన్ని ఏర్పాట్లకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. యుద్ధ విమానాలు, ఆయుధాలు, మందుగుండులాంటి వ్యూహాత్మక ఆస్తులు నిల్వ ఉంచే దాదాపు 54- 55 భారీ ఎయిర్‌బేస్‌లకు భారత వైమానిక దళం భద్రతను కల్పిస్తుందని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా పఠాన్‌కోట్ దాడికి సంబంధించి ముందుకెళ్లడానికి పాకిస్తాన్ భారత్‌నుంచి మరింత సాక్ష్యాన్ని కోరుతోందని, దర్యాప్తు నివేదికను బహిరంగ పరుస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హామీ ఇచ్చిన తర్వాత ఈ పరిణామాల గురించి బాగా తెలిసిన అధికారి ఒకరు సోమవారం చెప్పారు. ‘పఠాన్‌కోట్ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. బంతి తిరిగి భారత్ కోర్టులోకి వెళ్లింది. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తులో ముందుకు వెళ్లడానికి మాకు మరింత సాక్ష్యం కావాలి’ అని ఆ అధికారి చెప్పారు. భారత్‌నుంచి మరింత సమాచారాన్ని కోరుతూ ఈ సంఘటనపై దర్యాప్తు కోసం పాక్ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల బృందం మన విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఒక లేఖ కూడా రాసింది. జనవరి 2న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి జరిగిన వెంటనే మన దేశం పాక్‌కు చర్యలు తీసుకోదగిన కొంత సమాచారాన్ని అందించిన విషయం తెలిసిందే.