జాతీయ వార్తలు

కొబ్బరి మద్దతు ధర పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస మద్దతు ధరను 5950గా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. కొబ్బరి ప్రస్తుత మద్దతు ధర 5550గా ఉండగా, 2016 సంవత్సరానికి మద్దతు ధరను 5950 రూపాయలుగా నిర్ణయించారు. కమిషన్ ఫర్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ (సిఏసిపి) సిఫారసు మేరకు మద్దతు ధరను పెంచారు. కొబ్బరి ఉత్పత్తి ఖర్చులు, కొబ్బరి నుంచి నూనే తీసేందుకు అయ్యే ఖర్చు, డిమాండ్- సప్లై పరిస్థితి, దేశీయ, అంతర్జాతీయ ధరల సరళి, కొబ్బరి విషయంలో తీసుకునే విధాన నిర్ణయం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందనే దాని ఆధారంగా కొబ్బరి కనీస మద్దతు ధర పెంచాలని సిఏసిపి నిర్ణయించింది. బంతి కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు 5830 రూపాయల నుండి 2016 సంవత్సరానికి 6240 రూపాయలకు పెంచారు. కొబ్బరి కనీస మద్దతు ధరను పెంచటం ద్వారా రైతులను ఆదుకోవటంతోపాటు కొబ్బరి పరిశ్రమలో పెట్టుబడులను ప్రోత్సహించినట్టు అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.