జాతీయ వార్తలు

2017నాటికి 5వేల మెగావాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలో 2017నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఐదువేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్ తరాలకు ఉపాయోగపడేలా రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన నాల్గవ గ్రీన్ ఎనర్జీ సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి, తెలంగాణలోని పది జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పలకలు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వచ్చే మార్చికి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా 3వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి టెండర్లు ఆహ్వానించామన్నారు. తెలంగాణలో విండ్, సోలర్, వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా విద్యుదుత్పత్తికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని జగదీష్‌రెడ్డి వివరించారు. రైల్వే మంత్రిని కలిసిన జగదీష్‌రెడ్డి
కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును జగదీష్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తెజావత్‌లు కలిసి నల్గొండ జిల్లాలోని సూర్యపేట రైల్వే లైన్‌ను మెయిన్ లైన్‌తో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. దొనకల్- చిట్యాల, ఖమ్మం -నల్గొండ, ఖమ్మం -మిర్యాలగూడ రైల్వే లేన్ల నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక సర్వే జరిపించాలని రైల్వే మంత్రిని కోరారు. కొత్త రైల్వే లేన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పిన సురేష్‌ప్రభు, ప్రైవేటు కంపెనీలు ముందుకొస్తే రైల్వే లేన్ నిర్మాణ పనులు తక్షణం చేపడతామని హామీ ఇచ్చినట్టు జగదీష్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టడానికి కేంద్ర రవాణా, ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సూర్యాపేటలో ఆకాశవాణి కేంద్ర స్థాపనకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి విజ్ఞప్తి చేసినట్టు మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు.

చిత్రం... ఢిల్లీలో జరిగిన నాల్గవ గ్రీన్ ఎనర్జీ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి