అంతర్జాతీయం

దాడులు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన దాడుల ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలో ముంబయి దాడికి కుట్రదారు హఫీజ్ సరుూద్ రెచ్చగొట్టేరీతిలో మాట్లాడాడు. భారత్‌పై మరిన్ని దాడులను చేస్తామని హెచ్చరించాడు. అక్రమిత కాశ్మీర్‌లోని ఓ ర్యాలీలో మాట్లాడిన జమాద్ ఉద్ దవా(జెయుడి) అధ్యక్షుడు సరుూద్‌‘ ఇప్పటికి పఠాన్‌కోట్‌పై దాడినే చూశారు. మరిన్ని దాడులను చూడబోతున్నారు’అని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. కాశ్మీర్ ప్రజలపై భారత్ దళాలు మారణహోమం సాధిస్తున్నాయని ఆరోపించిన అతడు‘పఠాన్‌కోట్ తరహాలో తమ రక్షణ కోసం దాడులు జరిపే అధికారం కాశ్మీరీలకు లేదా?’అని ప్రశ్నించాడు.పఠాన్‌కోట్‌పై తామే దాడి జరిపామని ప్రకటించినందుకు కాశ్మీర్ ఉగ్రవాద నాయకుడు సయ్యద్ సలా ఉద్దీన్‌ను హఫీజ్ ప్రశంసించాడు. లష్కరె తొయిబా, జమాత్ ఉద్ దవా వంటి ఉగ్రవాద సంస్థకు మీడియా ప్రచారం ఇవ్వకూడదని పాక్ ప్రభుత్వం నిషేధించినప్పటికీ సరుూద్ గత నెలలో ఓ ప్రైవేటు వార్తాచానల్‌లో మాట్లాడాడు.