జాతీయ వార్తలు

మధ్యవర్తిత్వానికి ప్రత్యేక చట్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: వివాదాలు ముదిరి కోర్టులకెక్కడానికి ముందే పరిష్కారాలను ప్రోత్సహించడంతోపాటుగా కోర్టుల్లో కేసుల సంఖ్యను తగ్గించడానికి, కోర్టు వెలుపల పరిష్కారాలకు చట్టపరమైన మద్దతు కల్పించడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వివాహపరమైన వివాదాలను పరిష్కరించడానికి మాత్రమే మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాన్ని ఉపయోగించడం జరుగుతోంది.
అయితే భూ స్వాములు- కౌలుదారుల మధ్య వివాదాలు, పారిశ్రామిక వివాదాలు లాంటి ఇతర రంగాల్లో సైతం ఇలాంటి మధ్యవర్తిత్వ పరిష్కారాలను ప్రోత్సహించడానికి ఈ కొత్త చట్టం తోడ్పడుతుంది. కోర్టు కేసుల్లో చాలా భాగం ఈ రంగాలకు చెందినవే ఉంటున్నాయి. మధ్యవర్తిత్వం ఒక్కదానిపైనే ప్రత్యేక చట్టం చేయడం ద్వారా మధ్యవర్తి పరిష్కారాలకు చట్టబద్ధమైన మద్దతు ఇవ్వాలని కేంద్ర న్యాయ శాఖ ప్రతిపాదించినట్లు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక నోట్‌లో పేర్కొన్నారు. దేశంలో ఇప్పుడు మధ్యవర్తిత్వ పరిష్కార ప్రక్రియకు మద్దతు ఇచ్చే ఎలాంటి చట్టమూ లేదు. ఇలాంటి చట్టం లేకపోవడం వల్ల మధ్యవర్తిత్వం ద్వారా ఇచ్చే తీర్పుల చెల్లుబాటు లేదా వాటి అమలుకు సంబంధించి కక్షిదారుల్లో పలు అనుమానాలు, భయాలకు కారణమవుతోంది. అందువల్లనే కొంతమంది లాయర్ల ద్వారా, కోర్టుల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికే మొగ్గుచూపిస్తున్నారని ఆ నోట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు వివాదం కోర్టుకెక్కడానికి ముందే పరిష్కరించడం వల్ల కోర్టుల్లో కేసుల భారం కూడా తగ్గుతుందని ఇలాంటి కేసుల్లో భాగస్వాములైన కక్షిదారులు, లాయర్లు, జడ్జీలు, ఇతర నిపుణులు భావిస్తున్నారని ఆ నోట్‌లో పేర్కొన్నారు. వీలయినంత ఎక్కువ కేసులు గనుక కోర్టు వెలుపల పరిష్కారమయిన పక్షంలో దేశంలోని కోర్టుల్లో కేసుల భారం కూడా తగ్గుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని కోర్టుల్లో 2.64కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వైవాహిక వివాదాలు, కుటుంబ సమస్యలలోనే కాకుండా ఆస్తులు, భాగపరిష్కారాలు, భూస్వాములు-కౌలుదారులు, పారిశ్రామిక వివాదాలు లాంటి వాటిలో మధ్యవర్తిత్వ పరిష్కారాలను సమర్థవంతంగా అమలు చేయడంపై అనేక అనుమానాలున్నాయని కూడా ఆ నోట్ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో మధ్యవర్తిత్వ పరిష్కారాల ప్రక్రియ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ పరిష్కార కమిటీ ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. అంతేకాదు సంబంధిత రాష్ట్రాల హైకోర్టుల నేతృత్వంలోనే ఈ పరిష్కారాల ప్రక్రియ అంతా కూడా జరుగుతోంది.