అంతర్జాతీయం

కేసులో ఓడితే లొంగిపోతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 4: ఐక్యరాజ్య సమితి వర్కింగ్ గ్రూప్ శుక్రవారం వెలువరించే నిర్ణయం తనకు వ్యతిరేకంగా ఉంటే తాను బ్రిటిష్ పోలీసులకు లొంగిపోతానని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే గురువారం స్పష్టం చేశారు. లండన్ నగరంలోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో గత మూడేళ్లుగా తాను తలదాచుకోవడాన్ని అక్రమ నిర్బంధం కాదని ఐరాస వర్కింగ్ గ్రూప్ ప్రకటిస్తే తాను శుక్రవారం మధ్యాహ్నమే బ్రిటిష్ పోలీసుల ఎదుట లొంగిపోతానని ఆయన వెల్లడించారు. బ్రిటన్‌కు, స్వీడన్‌కు వ్యతిరేకంగా తాను ఐరాసకు చేసిన ఫిర్యాదులో ఓడిపోతే తదుపరి అప్పీలుకు వెళ్లడంలో అర్థం లేదని, అందువల్ల బ్రిటిష్ పోలీసులు తనను అరెస్టు చేసేందుకు వీలుగా తాను ఈక్వెడార్ దౌత్య కార్యాలయం నుంచి బయటకు వెళ్తానని అసాంజే వివరించారు. అసాంజే ప్రకటనను వికీలీక్స్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 44 ఏళ్ల అసాంజేకు ఈక్వెడార్ రాజకీయ ఆశ్రయం ఇవ్వడంతో ఆయన 2012 నుంచి సెంట్రల్ లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలోని ఒక చిన్న గదిలో ఉంటున్నారు. తాను అంతరిక్ష కేంద్రంలో ఉన్నట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. అసాంజే తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని స్వీడన్‌లోని ఇద్దరు మహిళలు ఆయనపై కేసు పెట్టారు. ఒకవేళ ఈక్వెడార్ దౌత్య కార్యాలయం నుంచి బయటకు వస్తే బ్రిటిష్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్వీడన్‌కు అప్పగిస్తారు. అంతటితో ఆగిపోదు. స్వీడన్ తనను అమెరికాకు అప్పగిస్తుందని, రహస్య పత్రాల బహిర్గతం విషయంలో అమెరికా తనను ఇంటరాగేట్ చేస్తుందని అసాంజే భయపడుతున్నారు. అసాంజే 2006లో స్థాపించిన వికీలీక్స్ అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించిన అయిదు లక్షల అమెరికా మిలిటరీ రహస్య దస్త్రాలను విడుదల చేసింది. అమెరికా వివిధ దేశాలతో జరిపిన రెండున్నర లక్షల రహస్య దౌత్య కేబుళ్లను కూడా బహిర్గతం చేసింది. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు అమెరికా సోల్జర్ చెల్సియా మానింగ్‌కు ఆ దేశం ఇప్పటికే 35 ఏళ్ల జైలుశిక్షను విధించింది.
లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తాను ఆశ్రయం పొందిన ఈ మూడేళ్ల కాలాన్ని అక్రమ నిర్బంధంగా ప్రకటించాలని అసాంజే ఐరాస వర్కింగ్ గ్రూప్‌కు ఇదివరకే ఫిర్యాదు చేశారు. అసాంజే ఫిర్యాదును విచారించిన వర్కింగ్ గ్రూప్ శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇదిలా ఉండగా, అసాంజే తనంత తానుగానే చట్టబద్ధమైన నిర్బంధం నుంచి తప్పించుకుంటున్నారని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా, లైంగిక దాడికి సంబంధించి ఇద్దరు మహిళలు చేసిన ఫిర్యాదుపై స్వీడన్ ప్రాసిక్యూటర్లు అసాంజేను ఈక్వెడార్ ఎంబసీలోనే విచారించనున్నారు.

ఇందుకు సంబంధించి స్వీడన్, ఈక్వెడార్ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు ఈక్వెడార్ అధ్యక్షుడు ధ్రువీకరించారు.