జాతీయ వార్తలు

పాకిస్తాన్ బోట్ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో పాకిస్తాన్‌కు చెందిన ఓ చేపల పడవను ఇండియన్ కోస్ట్‌గార్డ్ అధీనంలోకి తీసుకుంది. అరేబియా సముద్ర తీరప్రాంతమైన జఖావువద్ద భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన బోట్‌ను అడ్డుకుని 11 మంది జాలర్లను అరెస్టు చేశారు. ‘పాకిస్తాన్ పడవ భారత జలాల్లోకి ఐదు నాటికల్ మైళ్లు చొచ్చుకొచ్చింది’ అని కోస్ట్‌గార్డ్ కెప్టెన్ అభిషేక్ మటిమన్ చెప్పారు. పడవలోని 11మందిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. పడవను స్వాధీనం చేసుకుని విచారణ జరపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఉగ్రదాడులకు కుట్ర
మదర్సా యజమాని అరెస్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశంలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్నాడన్న ఆరోపణలపై ఇస్లామిక్ మత గురువుగా చెప్పుకుంటున్న మదర్సా యజమానిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని సీలంపూర్ నివాసి అయిన నిందితుడు అబ్దుస్ సమీ కాస్మీని ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో శుక్రవారం అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థను ఏర్పాటుచేసి దేశంలో దాడులు జరిపేందుకు కుట్ర పన్నుతున్నారన్న కేసు దర్యాప్తులో భాగంగా అబ్దుస్ సమీని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న అబ్దుస్ సమీ కొన్ని వెబ్‌సైట్లను ప్రారంభించి వాటిలో తన ప్రసంగాలను అప్‌లోడ్ చేశాడని, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రసంగాలు ఇచ్చిన అబ్దుస్ సమీ యువతను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పురిగొల్పుతున్నాడని ఎన్‌ఐఎ అధికారులు వివరించారు. అబ్దుస్ సమీ ఒక ట్రస్టును, కొన్ని మదర్సాలను నడుపుతున్నాడని, వీటికి సంబంధించి అతను నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో వాటిపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు గతంలో అబ్దుస్ సమీకి వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

లేహ్ విమానాశ్రయాన్ని
ఖాళీచేయనున్న ఎయిర్‌ఫోర్స్

శ్రీనగర్, ఫిబ్రవరి 6: కాశ్మీర్‌లోని లేహ్ విమానాశ్రయాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఖాళీ చేయనుంది. దానికి ప్రత్నామ్నయంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాలో మరొకచోట విమానాశ్రయాన్ని ఎయిర్‌ఫోర్స్ అభివృద్ధి చేసుకోనుంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరునాటికి నిర్ణయం ఖారారవుతుంది. కార్గిల్ జిల్లాలో తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఖాళీ చేసి ఇవ్వడానికి ఆర్టీ కూడా అంగీకరించింది. డివిజనల్ కమిషనర్ (కాశ్మీర్) అస్గర్ హసన్ సమూన్ శుక్రవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. లేహ్ విమానాశ్రయాన్ని ఖాళీ చేయడానికి ఎయిర్‌ఫోర్స్ అధికారులు అంగీకరించారని చెప్పారు. లడఖ్ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి ఐఏఎఫ్, ఎయిర్‌పోర్టు అథారిటీ, స్థానిక అధికారులు హాజరయ్యారని ఆయన అన్నారు. లేహ్ విమానాశ్రయం ఖాళీ చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన స్పష్టం చేశారు. లేహ్‌కు బదులుగా మరోచోట స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరిస్తే నిపుణులు పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే స్థలం స్వాధీనం చేసుకుంటామని ఎయిర్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు.

1కి చేరిన బస్సు ప్రమాదం మృతులు
అహ్మదాబాద్, ఫిబ్రవరి 6: గుజరాత్ ఆర్టీసీ బస్సు నవ్‌సారి వద్ద పూర్ణానదిలో పడిపోయిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 41కి పెరిగింది. వీరిలో 21 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులతోపాటు 15 మంది పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ శనివారం పరామర్శించారు. మరణించినవారి కుటుంబానికి 4లక్షల ఆర్థిక సాయాన్ని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉకాయ్ నుంచి నవ్‌సారికి వెళుతున్న బస్సు ఒక మలుపు వద్ద అదుపుతప్పి 23 అడుగుల ఎత్తునుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా తలకిందులైంది.
బస్సులో 68 మంది ప్రయాణికులున్నారని, అందరూ రోజువారీ కూలిపని చేసుకుని బతికేవారేనని ఇన్‌స్పెక్టర్ ఎస్.బి. షేక్ తెలిపారు.