అంతర్జాతీయం

డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రగామిగా ఉందని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉద్ఘాటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని అభివృద్ధికి భారత్‌లో గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ప్రముఖ ఐటి సంస్థలకు పిలుపునిచ్చారు. అమెరికా, భారత్‌లోని ప్రముఖ ఐటి సంస్థలతో యుఎస్‌ఐబిసి (అమెరికా, భారత వాణిజ్య మండలి) శుక్రవారం మసాచ్యుసెట్స్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రవిశంకర్ ప్రసాద్ ప్రసంగిస్తూ, అభివృద్ధికి భారత్‌లో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రగామిగా ఉంది. పెద్దపెద్ద నగరాలు మొదలుకొని చిన్నచిన్న పట్టణాల వరకు అద్భుత అనుసంధానతను కలిగివున్న భారత్ కేవలం తమ పౌరుల ఆర్థిక, సంక్షేమ అవకాశాలను పెంపొందించుకోవడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సవ్యమైన దిశలో నడిపించేందుకు కృషి చేస్తోంది’ అని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతి విధాన నిర్ణయాన్ని ఎంతో పారదర్శకమైన, సహేతుకమైన రీతిలో తీసుకుంటోందని, అందుకే ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని భారత్‌లో అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా అమెరికా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నానని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి గూగుల్, ఎటిఅండ్‌టి, మాస్టర్‌కార్డ్, ఫేస్‌బుక్, అమెరికన్ టవర్ కార్పొరేషన్, యుఎస్‌టి గ్లోబల్, ఐటెక్ తదితర ప్రఖ్యాత ఐటి సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు.