జాతీయ వార్తలు

మా నేతలకు లాభాపేక్ష లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక వివాదంలో తన వైపు వాదనను వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ తన వెబ్‌సైట్‌లో ‘తరచూ అడుగుతున్న ప్రశ్నలు’, వాటికి సమాధానాలను ఉంచింది. అంతేకాదు, యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐ)సంస్థనుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆర్థికంగా ఎలాంటి లబ్ధి పొందలేదని కూడా పార్టీ స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్) సంస్థ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృష్ట్యా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ కంపెనీ వాస్తవానికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు రుణాలు ఇవ్వడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ 2012 నవంబర్‌లోనే ఒక స్పష్టమైన ఉత్తర్వు ఇచ్చిందని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ కారణంపైనే కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కోరారని, అయితే ఆ సమయంలో ఎన్నికల కమిషన్‌కు చెందిన ఫుల్‌బెంచ్ ఆయన ఫిర్యాదును తన ఉత్తర్వులో కొట్టివేసిందని స్పష్టం చేసింది.
‘యంగ్ ఇండియన్’ ద్వారా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ ఆర్థికంగా లబ్ధి పొందారా? అన్న ప్రశ్నకు లేదని పార్టీ స్పష్టం చేసింది. సెక్షన్ 25 కింద లాభాపేక్ష లేని కంపెనీగా రిజిస్టర్ అయిన ‘యంగ్ ఇండియన్’ డైరెక్టర్లుగా లేదా వాటాదారులుగా చట్ట ప్రకారం వారు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందడానికి వీల్లేదని పార్టీ స్పష్టం చేసింది. అంతేకాకుండా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్‌కు ఆస్తులేవీ బదిలీ కాలేదని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది. ‘ఎజెఎల్‌కు చెందిన ఆస్తులు, ఆదాయం అంతా కూడా ఆ కంపెనీ వద్దే ఉన్నాయి. ఒక్క పైసా కూడా యంగ్ ఇండియన్‌కు, యంగ్ ఇండియన్ డైరెక్టర్లు లేదా వాటాదారులకు వెళ్లలేదు’ అని ‘నేషనల్ హెరాల్డ్’ అనే హెడ్‌లైన్‌తో తన వెబ్‌సైట్‌లో ‘తరచూ అడుగుతున్న ప్రశ్నలు-సమాధానాలు’లో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను దురాక్రమణ చేయడానికే యంగ్ ఇండియన్‌ను ఏర్పాటు చేశారన్న ఆరోపణలను సైతం అది తోసిపుచ్చింది. నిజానికి ఎజెఎల్‌లో ఒక ప్రధాన వాటాదారుగా యంగ్ ఇండియన్ ఉండడం వల్ల ఎజెఎల్ ఆస్తులకు రక్షణ పెరిగిందని స్పష్టం చేసింది. కాగా, యంగ్ ఇండియన్ సంస్థ నిజానికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఆ ప్రకటన శుద్ధ తప్పని కాంగ్రెస్ స్పష్టం చేసింది. యంగ్ ఇండియన్‌కు ఒక్క రియల్ ఎస్టేట్ ఆస్తి కానీ, స్థిరాస్తి కానీ లేదని, ఎజెఎల్ వద్దే దాని ఆస్తులన్నీ ఉన్నాయని, అందువల్ల ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది.