జాతీయ వార్తలు

చిదంబరం కుమారుడి కంపెన్నీల్లో ఐటి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 1: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్తీ చిదంబరంతో సంబంధం ఉన్న వ్యాపార భాగస్వాములకు చెందిన కొన్ని కార్యాలయాలపై ఆదాయం పన్ను విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం సోదాలు జరిపాయి. సోదాలు జరుపుతున్న వాటిలో కార్తీ చిదంబరానికి వాటా ఉన్న ఒక ప్రైవేట్ ఐ కేర్ సంస్థసహా కొన్ని కంపెనీలు ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపాయి. ఈ కంపెనీలు పన్ను ఎగవేతకు సంబంధించి వచ్చిన ఆరోపణపై ఆదాయం పన్ను శాఖ ఈ చర్య తీసుకొంటుండగా, విదేశీ మారకద్రవ్యం నిర్వహణ చట్టం (ఫేమా)లోని నిబంధనలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ సోదాలు నిర్వహిస్తోంది.
నా కుటుంబంపై కేంద్రం కుట్ర: చిదంబరం
కేంద్ర ప్రభుత్వం తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ఒక వేళ కేంద్రం తనపై కక్ష సాధించాలనుకుంటే నేరుగానే ఆ పని చేయవచ్చని, తన కుమారుడు కార్తి స్నేహితులను వేధించవద్దని కూడా ఆయన అన్నారు. కేంద్రం దాడిని ఎదుర్కోవడానికి తాను, తన కుటుంబం సిద్ధంగా ఉందని కూడా ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. తాను ప్రయాణం మధ్యలో ఉండగా చెన్నైలో తన కుమారుడికి సంబంధం ఉన్న కొన్ని కంపెనీల్లో సోదాలు జరుగుతున్నట్లు తనకు సమాచారం అందిందని చిదంబరం చెప్పారు. ప్రస్తుతం దాడులు జరుగుతున్న సంస్థల్లో తనకు కానీ, తన కుటుంబానికి కాని ఎలాంటి వాటాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు లేవని తాము పదే పదే స్పష్టం చేయడం జరిగిందని ఆయన చెప్పారు.

కేంద్ర వక్ఫ్ మండలి
సభ్యుడిగా ఖాన్

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుడుగా నియమితులయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం కేంద్ర అల్పసంఖ్యాల వర్గాల సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన కేంద్ర వక్ఫ్ మండలిని ఏర్పాటు చేసింది. మహమ్మద్ అలీ ఖాన్‌తోపాటు ఇరవై మంది ముస్లిం మత నాయకులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు మండలిలో సభ్యులుగా నియమితులయ్యారు. వీరు మూడు సంవత్సరాల పాటు మండలి సభ్యులుగా వ్యవహరిస్తారు.

సుబ్రహ్మణ్యస్వామికి
తగిన శాస్తి: విహెచ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: చౌక బారు ప్రచారం కోసం ప్రముఖలను లక్ష్యంగా పెట్టుకుని న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేసే భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీమ్ కోర్టు గుణపాఠం చెప్పిందని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ తాను వేసిన పిటీషన్‌పై విచారించవలసిందిగా సుబ్రహ్మణ్యస్వామి చేసిన విజ్ఞప్తిని సుప్రీమ్ కోర్టు తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయనకు గుణపాఠం కావాలని హనుమంతరావు చెప్పారు. న్యాయస్థానాలలోకేసు దాఖలు చేసి పత్రికలలోప్రచారం పోందటం సుబ్రహ్మణ్యస్వామికి అలవాటైపోయిందని ఆయన విమర్శించారు

రైల్వే టికెట్ల రద్దుకు
ఇక ప్రత్యేక కౌంటర్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: రైల్వే టికెట్‌ను రద్దు చేసుకునేందుకు, రావాల్సిన చార్జీ మొతాన్ని తిరిగి పొందేందుకు సంబంధిత రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా కౌంటర్లను కేటాయించనున్నారు. ఇది తక్షణం అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న కౌంటర్లలో అన్‌రిజర్వుడ్ టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఒకదానిని పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్‌గా మార్చాలని, ఆ కౌంటర్‌లోనే టికెట్ కాన్సిలేషన్‌తో పాటు టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రైల్వేస్టేషన్లకు పంపించడం జరిగిందని, ఈరోజునుంచే అమలులోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే రైలు బయలుదేరే సమయానికి ఒక రోజు ముందు అంటే 24 గంటలలోపు కాన్సిల్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ కౌంటర్లు సేవలందిస్తాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.