జాతీయ వార్తలు

ప్రభుత్వ ఏర్పాటుపై మెహబూబా నోరు విప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: జమ్మూ-కాశ్మీరులో ప్రభుత్వ ఏర్పాటు విషయమై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) చీఫ్ మెహబూబా ముఫ్తీ నోరు విప్పాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరనెన్స్ (ఎన్‌సి) నాయకుడు ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఆదివారం జమ్మూలో ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పిడిపి-బిజెపి మధ్య పొత్తు విచ్ఛిన్నమైతే కమలనాథులకు మద్దతు తెలిపేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఎంతోకాలం నుంచి నోరు విప్పడం లేదు. ఆమె తన వౌనాన్ని ఎంతోకాలం కొనసాగించలేరు. రెండు మూడు అంశాలపై ఆమె తన వైఖరిని వెల్లడించాలి. విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? వాటి కోసం ఇంకెంత కాలం ఎదురుచూస్తారు? ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మరణించిన తర్వాత అకస్మాత్తుగా ఈ విశ్వాస చర్యల అవసరం ఎందుకొచ్చిందన్న వివరాలను మెహబూబా స్పష్టం చేయాలి’ అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ పిడిపి-బిజెపి మధ్య పొత్తు సజీవంగానే ఉందని, ఈ పొత్తు తెగతెంపులైనట్లు అటు పిడిపి గానీ ఇటు బిజెపి గానీ చెప్పలేదని, అటువంటప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఎందుకు నాన్చుతున్నారని ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో పిడిపి-బిజెపి కూటమి అజెండాను ఖరారు చేసుకున్న తర్వాతే ముఫ్తీ మొహమ్మద్ సరుూద్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఈ రెండు పార్టీలకు తగిన సంఖ్యా బలం ఉంది. అయినా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?’ అని నిలదీశారు.