జాతీయ వార్తలు

ముంబయి దాడులపై గుట్టు విప్పిన హెడ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయిపై జరిగిన 26/11 దాడిలో కుట్ర కోణాన్ని లష్కరే తోయిబా ఆపరేటివ్ డేవిడ్ హాడ్లీ కళ్లకుకట్టాడు. 2008లో జరిగిన దాడికి ముందే రెండుసార్లు విఫలయత్నం జరిగిందన్నాడు. దాడి వెనుక పన్నాగమేమిటి? ఎవరి ప్రమేయం ఉంది? అందులో పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ పాత్ర ఏమిటన్న వౌలిక వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి జిఎ సనప్‌కు వివరించాడు. విదేశీ గడ్డమీద ఉన్న ఒక నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతీయ కోర్టు ముందు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ముంబయి నగరంపై దాడికి ఐఎస్‌ఐతో కలిసి లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర కోణాన్ని వివరించడంతోపాటు, ఆ సంస్థ తనకిచ్చిన శిక్షణ వివరాలను పూసగుచ్చినట్టు వివరించాడు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు ఐదున్నర గంటలపాటు సాగింది.
ఎల్‌ఇటి వ్యవస్థాపకుడు హఫీజ్ సరుూద్, కమాండర్ జకీఉర్ రెహ్మాన్ లఖ్వీ నేతృత్వంలో ఆ ఉగ్రవాద సంస్థ తనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో, ఇస్లామాబాద్ సమీపంలోని అబొటాబాద్‌లో ఉగ్రవాద శిక్షణ ఇచ్చిందని హెడ్లీ వివరించాడు. హఫీజ్ సరుూద్ చిత్రాన్ని కూడా అతను గుర్తుపట్టాడు. ముగ్గురు ఐఎస్‌ఐ అధికారులు- మేజర్ అలీ, మేజర్ ఇక్బాల్, మేజర్ అబ్దుల్ రెహ్మాన్ పాషాలతో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుండేవాడినని హెడ్లీ కోర్టుకు చెప్పాడు. లఖ్వీ సహా ఎల్‌ఇటి కమాండర్లు, ఐఎస్‌ఐ అధికారులు చేసిన సూచనల మేరకే భారత్‌పై దాడి చేయడానికి ముందు రెక్కీ నిర్వహించడం కోసం తన అసలు పేరు దావూద్ గిలానీని డేవిడ్ కోల్‌మాన్ హెడ్లీగా మార్చుకున్నానని అతను వెల్లడించాడు. ముంబయి నగరంపై 2008 నవంబర్ 26న దాడికి దిగి 166 మందిని పొట్టన పెట్టుకున్న పది మంది ఉగ్రవాదులు అంతకు ముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా రెండుసార్లు దాడికి ప్రయత్నించి, విఫలమయ్యారని హెడ్లీ ఈ విచారణ సందర్భంగా తెలిపాడు. ఒకసారి సముద్రంలో వారి పడవ రాయిని ఢీకొనడంతో వారి వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి సముద్రంలో పడిపోయాయని, దాంతో వారు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారని వివరించాడు. తాను భారత్‌ను శత్రువుగా భావించేవాడినని, హఫీజ్ సరుూద్, లఖ్వీ కూడా భారత్‌ను శత్రువుగా పరిగణించేవారని హెడ్లీ చెప్పాడు.
స్పెషల్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ కూడా హెడ్లీని ప్రశ్నించారు. హఫీజ్ సరుూద్ ప్రభావం, ప్రేరణల వల్ల తాను ఎల్‌ఇటిలో చేరానని హెడ్లీ ఈ సందర్భంగా అంగీకరించాడు. ఎల్‌ఇటికి తాను నిజమైన కార్యకర్తనని అతను చెప్పుకున్నాడు. 2002లో ముజఫరాబాద్‌లో తాను తొలిసారి ఎల్‌ఇటికి సంబంధించిన ప్రాథమిక శిక్షణ పొందానని, తరువాత హఫీజ్ సరుూద్, లఖ్వీ నేతృత్వం వహించిన నాయకత్వ స్థాయి శిక్షణను పూర్తి చేశానని హెడ్లీ వెల్లడించాడు. సుమారు రెండేళ్ల వ్యవధిలో ఎల్‌ఇటి శిబిరాలలో అయిదారు శిక్షణ తరగతులకు తాను హాజరయ్యానని చెప్పాడు. లాహోర్‌లోని మురిద్‌కెలో నిర్వహించిన అధ్యయన కోర్సు ‘దౌరా ఎ సుఫా’కు, పిఒకెలోని ముజఫరాబాద్‌లో నిర్వహించిన ప్రాథమిక సైనిక శిక్షణ కోర్సు ‘దౌరా ఎ ఆమ్’కు హాజరయినట్లు హెడ్లీ వెల్లడించాడు. మరింత ఉన్నతమైన శిక్షణ ‘దౌరా ఎ ఖాస్’లో తాను ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను ఉపయోగించడం నేర్చుకున్నానని అతను చెప్పాడు. ఇంటెలిజెన్స్ కోర్సు అయిన ‘దౌరా ఎ రిబత్’ శిక్షణను కూడా ఎల్‌ఇటి తనకు ఇచ్చిందని వెల్లడించాడు. ఈ శిక్షణలో సురక్షితమైన స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం, గూఢచర్య దృష్టితో ప్రాంతాలను పరిశీలించడం వంటివి నేర్పించారని చెప్పాడు. అబొటాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనె్సరాలో ఈ శిక్షణ పొందినట్లు హెడ్లీ తెలిపాడు. అబొటాబాద్‌లో ఉండగానే అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికన్ కమాండోలు హతమార్చిన విషయం తెలిసిందే.