జాతీయ వార్తలు

విశ్వభారతి విసి బర్తరఫ్ ఫైలు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: విశ్వ భారతి వైస్ చాన్సలర్ సుశాంత దత్త గుప్తాను బర్తరఫ్ చేయడానికి సంబంధించిన ఫైలును రాష్టప్రతి కార్యాలయం మరోసారి తిప్పి పంపింది. గత మూడు నెలల్లో రాష్టప్రతి కార్యాలయం ఈ ఫైలును తిప్పపంపడం ఇది రెండోసారి. వైస్ చాన్సలర్‌పై మోపిన ఆరోపణలపై వ్యక్తిగతంగా ఆయన వాదనను వినడానికి అవకాశం ఇవ్వకపోవడం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా అనే ప్రశ్నను లేవనెత్తుతూ రాష్టప్రతి కార్యాలయం ఈ ఫైలును గతవారం తిప్పి పంపించినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. రాష్టప్రతి కార్యాలయం ఈ ఫైలును తిప్పి పంపడం ఇది రెండోసారి. అంతేకాదు దత్తగుప్తా ఇ-మెయిల్‌లో పంపిన రాజీనామాను ఆమోదించాలన్న మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను సైతం రాష్టప్రతి కార్యాలయం తోసిపుచ్చింది. కాగా ఇంతకుముందు గత సెప్టెంబర్‌లో దత్తగుప్తాపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకోవాలని మంత్రిత్వ శాఖను ఆదేశిస్తూ రాష్టప్రతి కార్యాలయం ఈ ఫైలును వెనక్కి పంపించింది. దీనిపై హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ న్యాయ శాఖ సలహాను తీసుకుని తిరిగి ఫైలును రాష్టప్రతి కార్యాలయానికి పంపించింది. ఒకవేళ దత్తగుప్తాను గనుక బర్తరఫ్ చేయాలని ఆదేశించినట్లయితే కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నిటికీ విజిటర్ అయిన రాష్టప్రతి ఒక వైస్ చాన్సలర్‌ను తొలగించడం ఇదే మొదటిసారవుతుంది. గుప్తాపై వచ్చిన అభియోగాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఏకకాలంలో విశ్వభారతి యూనివర్సిటీనుంచి వేతనం, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీనుంచి పింఛను పొందుతున్నారనేది ఒకటి.