జాతీయ వార్తలు

సనాతన ధర్మరక్షణే మోదీ ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బృందావనం, ఫిబ్రవరి 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సనాతన ధర్మ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే ఇప్పటివరకూ మత రాజకీయాలు సాగేవని ఈ రెండింటిని వేరుచేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. భారత దేశాన్ని సుసంపన్న దేశంగా మార్చడమే కాకుండా దాని ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా విశ్వవ్యాప్తం చేయడమే ఎన్‌డిఏ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సోమవారం ఇక్కడ రాధాకృష్ణులకు అంకితం చేసిన 125 అడుగుల ప్రియంతక్‌జూ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అమిత్‌షా మాట్లాడారు. భారతదేశ అభివృద్ధితోపాటు ఆధ్యాత్మిక విలువలను ప్రపంచ దేశాలన్నింటికీ అందించే ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ఉందని తెలిపారు. భారతీయ సంస్కృతిని సనాతన ధర్మంగా పేర్కొనే హిందూమత ఆదర్శాలను కూడా శక్తివంతం చేయడానికి తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నికైన తరువాత కాశీ వెళ్లి గంగా హారతిని నిర్వహించిన ఘనత మోదీదేనని చెప్పారు. దేశంలోని నదులను ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, మోదీ చేసిన కృషి కారణంగానే భారతీయ యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని తెలిపారు. గుజరాత్‌కు బృందావనానికి మధ్య బలమైన సంబంధం ఉందన్న నిజాన్ని కృష్ట భగవానుడు చాటిచెప్పాడని అమిత్ షా వెల్లడించారు. తాను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా తనలో సరికొత్త శక్తి పుట్టుకొస్తుందని తెలిపారు. ఈ కొత్త ఆలయం భారతీయ సంస్కృతిని మరింతగా పెంపొందిస్తుందని షా అన్నారు.