అంతర్జాతీయం

ట్రాయ్ నిర్ణయం నిరాశ కలిగించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 9: నెట్ న్యూట్రాలిటీకి మద్దతు ఇవ్వాలని టెలికాం రెగ్యులేటర్ ‘ట్రాయ్’ తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ‘ఫేస్‌బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో వినియోగదారులు స్వేచ్ఛగా డేటా పొందడానికి తన సంస్థ, ఇతర సంస్థలు చేపట్టిన కార్యక్రమాలకు ట్రాయ్ నిర్ణయం అడ్డంకిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ‘్భరత్‌లో వినియోగదారులకు ఉచితంగా డేటా అందించే కార్యకమాలపై ఆంక్షలు విధించాలని ఈ రోజు ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. డేటా ఉచితంగా పొందడానికి వీలు కల్పించే తమ సంస్థ అయిన ‘ఇంటర్నెట్.ఒఆర్‌జి’కి చెందిన ఫ్రీ బేసిక్స్, ఇతర సంస్థల కార్యక్రమాలను ఇది అడ్డుకుంటుంది’ అని సోమవారం రాత్రి పొద్దుపోయాక ట్రాయ్ జారీ చేసిన ఆదేశాలపై స్పందిస్తూ ఫేస్‌బుక్ చైర్మన్, సిఈఓ కూడా అయిన జుకర్‌బర్గ్ అన్నారు. ఈ నిర్ణయం తమకు తీవ్ర అసంతృప్తి కలిగించిందని ఆయన అన్నారు. ‘్భరత్‌లో, ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీకి కల్పించే అడ్డంకులను బద్దలు కొట్టడానికి కృషి చేస్తూనే ఉంటామని వ్యక్తిగతంగా తెలియజేయాలని నేను అనుకున్నాను. ఇంటర్నెట్.ఒఆర్‌జి దీనికోసం ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ సేవలు పొందేలా చూసే వరకు మేము కృషి చేస్తూనే ఉంటాం’ అని ఆయన ఫేస్‌బుక్‌లో ఉంచిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఫేస్‌బుక్ చేపట్టిన ఫ్రీ బేసిక్స్ కార్యక్రమం వివాదంగా మారిన విషయం తెలిసిందే. తమకిష్టమైన ఇంటర్నెట్ సేవలను పొందడానికి వ్యక్తులకుండే స్వేచ్ఛను ఇది హరిస్తుందని నిపుణులు విమర్శిస్తూ ఉండడం తెలిసిందే. సమాచారం అధారంగా ఇంటర్నెట్ పొందడానికి ఆపరేటర్లు వేర్వేరు చార్జీలు వసూలు చేయడాన్ని ట్రాయ్ సోమవారం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ‘ఇంటర్నెట్.ఒఆర్‌జి’ ద్వారా ఫేస్‌బుక్ చేసిన కృషివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది జీవితాలు మెరుగుపడ్డాయని జుకర్‌బర్గ్ చెప్పుకొన్నారు. ఇండియాతో అనుసంధానం కావడం తమ ముఖ్యమైన లక్ష్యమని, దాన్ని తాము వదిలిపెట్టమని, ఎందుకంటే భారత్‌లోని వందకోట్లకు పైగా ఉన్న ప్రజలకు ఇంటర్నెట్ అవకాశాలు లేవని ఆయన అన్నారు. వాళ్లతో అనుసంధానం కావడం వల్ల వాళ్లను పేదరికంనుంచి పైకి తేగలుగుతామని, లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని, విద్యా అవకాశాలు విస్తరిస్తాయని తమకు తెలుసునని ఆయన అంటూ, అందుకే వారితో కనెక్ట్ కావాలని తాము అంతగా కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. ఫేస్‌బుక్ చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లోని కోటీ 90 లక్షలకు పైగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలనేది తమ లక్ష్యమని, అందుకోసమే తాము రకరకాల పథకాలతో ఇంటర్నెట్.ఒఆర్‌జిని ప్రారంభించామని కూడా జుకర్‌బర్గ్ చెప్పుకొన్నారు.