జాతీయ వార్తలు

రైలు ప్రయాణ చార్జీల మోత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఆర్థికంగా ఎదురవుతున్న భారాన్ని కుదించుకునేందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రయాణికులపై ఐదు నుంచి పదిశాతం మేర చార్జీల మోత వేసే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ప్రవేశ పెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికుల చార్జీలను పెంచే ప్రతిపాదనలపై చురుగ్గా పరిశీలన జరుగుతోంది.ప్రయాణ, రవాణ మార్గాల్లో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గి పోవడంతో రైల్వే శాఖ నిధుల కొరతతో కుదేలవుతోంది. ముఖ్యంగా ఏడో వేతన కమిషన్ సిఫార్సులు అమలు చేయడం వల్ల అదనంగా 32కోట్ల రూపాయల మేర భారం పడిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కేటాయించిన నిధులను రైల్వేలు పూర్తిగా వినియోగించుకోవడం లేదన్న కారణంగా 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ కేటాయింపులను 8కోట్ల మేర ఆర్థిక మంత్రిత్వ శాఖ తగ్గించింది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికుల చార్జీలను పెంచడంతో పాటు ఇతరత్రా ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలపై రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టిన మాట వాస్తవమే అయినా ఇంత వరకూ ఏదీ ఖరారు కాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చార్జీలను పెంచాలని నిర్ణయించినా బడ్జెట్ ప్రతిపాదనల్లోనే వీటిని ప్రవేశ పెట్టాలని ఏమీ లేదని..ఏ సమయంలోనైనా ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉందని వివరించాయి. బడ్జెట్ తర్వాత ఎప్పుడో చార్జీలను పెంచే కంటే 25న ప్రవేశ పెట్టే బడ్జెట్‌లోనే వీటిని ప్రతిపాదించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని..మార్చిలో విస్తృతంగా జరిగే ‘పీక్ సీజన్’ను సొమ్ము చేసుకోవచ్చునని పేర్కొన్నాయి. ఇప్పటికే ఎసి చార్జీలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వీటిని మరింత పెంచితే చిన్న స్థాయి విమాన ప్రయాణ చార్జీలను దాటిపోయే అవకాశం ఉందన్న వాదనా వినిపిస్తోంది.