జాతీయ వార్తలు

హెడ్లీ విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 10: వీడియో లింకేజీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 26/11 ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ నుంచి బుధవారం వాంగ్మూలం రికార్డుచేయలేకపోయారు. దీంతో గురువారం అతడి నుంచి సాక్ష్యం నమోదు చేస్తారు. రెండ్రోజులుగా అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హడ్లీ ఇక్కడ కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘అమెరికా వైపునుంచి వీడియో అనుసంధానంలో సాంకేతిపరపైన సమస్యలు తలెత్తాయి. బుధవారం ఉదయం అనేకసార్లు అంతరాయం ఏర్పడింది’ అని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు. గురువారం తిరిగి హెడ్లీ నుంచి వాంగ్మూలం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 12 వరకే హెడ్లీని విచారించాల్సి ఉంది. బుధవారం వాంగ్మూలానికి అంతరాయం ఏర్పడడంతో మరోరోజు పొడిగించే అవకాశం ఉంది.

విశ్వభాషగా హిందీ
భారతీయ భాషలను అభివృద్ధి చేయాలి: యార్లగడ్డ

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: భారతీయ భాషలను అభివృద్ధి చేస్తేనే హిందీ జాతీయ భాష, విశ్వభాషగా గుర్తింపు పొందుతుందని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. లక్ష్మీప్రసాద్ ఒడిషాలోని పెట్రోలియం మంత్రిత్వ శాఖ హిందీ సలహాదారుల సమావేశంలో ప్రసంగించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ సంఘం సలహాలు, సూచనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహిత ప్రతిభారాయ్, ఓఎన్‌జిసి, ఐఓసీఎల్,హెచ్‌పీ, సీఎల్, బీపీసీఎల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంస్థల్లో హిందీ భాష అమలును అధికారుల సమీక్షించారు. పూరీలో జరిగిన సమావేశానంతరం లక్ష్మీప్రసాద్ భువనేశ్వర్‌లోని ఆంధ్ర సంస్కృతి సమితి ప్రతినిధులతో భేటీ అయ్యారు. సమితి అధ్యక్షుడు ఎంవిరావు, ఉపకార్యదర్శి కెఎస్‌ఆర్ రమేష్, ఉపాధ్యక్షుడు వి శ్రీనివాస్, కె వరదరాజులు తదితరులు యార్లగడ్డను సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.

తెలుగు భాష, సంస్కృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.