జాతీయ వార్తలు

‘హోదా’కు ఏకాభిప్రాయంతో పనిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఏకాభిప్రాయంతోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభిస్తుందని కేంద్ర మంత్రులెవరు ప్రకటించినా తప్పే అవుతుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర సాంకేతికాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి స్పష్టం చేశారు. ప్రత్యేక కేటగిరి హోదాను ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. సభలో ఆయన ఇచ్చిన హామీని అమలు చేయవలసిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై ఉందని ఆయన విలేఖరులకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు దక్కవలసిన ప్రయోజనాలు లభించకపోవటంతో 18 నెలలుగా ప్రజలు పడుతున్న వ్యధలను సోమవారం రాజ్యసభలో మంత్రిగాకాక ఒక సాధారణ సభ్యునిగా వివరించినట్లు ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రజల మనోగతాన్ని తన ప్రసంగం ప్రతిబింబించగలదన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయ సాధనతోనే ప్రత్యేక కేటగిరి హోదా సాధ్యపడుతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారని ఒక విలేఖరి ప్రస్తావించగా, వెంకయ్య నాయుడు అలా చెప్పి ఉంటారని తాను భావించటం లేదని, ఒకవేళ అలా అనివుంటే అది తప్పే అవుతుందని చౌదరి స్పష్టం చేశారు. మనకు ప్రత్యేక కేటగిరి హోదా ఇస్తారా లేక మోడరన్ కేటగిరి హోదా ఇస్తారా అన్నది అప్రస్తుతం. మనకు ఇచ్చిన హామీల అమలు, నిధులు రావటమే ముఖ్యమని చౌదరి స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరి హోదా ఇస్తామని సభలోప్రకటించిన వెంకయ్య నాయుడు, ఇప్పుడు బాణి మారుస్తున్నారని ఒక విలేఖరి ప్రస్తావించగా, ఈ అంశంతో వెంకయ్యకు ప్రత్యక్ష సంబంధం లేదని ఆయన చెప్పారు. అయితే కేంద్ర మంత్రి హోదాలో వివిధ శాఖలతో సమన్వయం పెంపొందించుకున్న వెంకయ్యకు అన్ని కోణాల నుంచి సమాచారం లభిస్తుంటుందని ఆయన చెప్పారు. ప్రత్యేక కేటగిరి హోదాకోసం తమ పార్టీ అధినాయకత్వం, ఎంపీలు అవిశ్రాంతంగాకృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రతి రంగంలో పూర్తిన్యాయం లభించేంతవరకూ తమ పార్టీ విశ్రమించదని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే జిఎస్టీ బిల్లును తమ పార్టీ బలపరిచి తీరుతుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు, అందే నిధులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై అవగాహన కలిగించి, లక్ష్యసాధనకు అనుసరించవలసిన వ్యూహాన్ని సూచించటానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సంస్థ మొదటి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సంస్థ తమ పార్టీ అధీనంలో పని చేస్తుందని చౌదరి తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఆంధ్రా, తెలంగాణ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని ఆయన వాదించారు.