జాతీయ వార్తలు

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: రాష్ట్భ్రావృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ బురద జల్లుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విరుచుకుపడ్డారు. అన్నాడిఎంకె ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలన్నీ అభూత కల్పనలేనని బుధవారం ఆమె విమర్శించారు. ప్రతిపక్షం దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నాడిఎంకె కార్యకర్తలను ఆమె పిలుపునిచ్చారు. ‘ప్రతిపక్షాలకు పనీపాటాలేదు. రాష్ట్రం అలాగే ప్రజల బాగోగులు వారికి పట్టదు. ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు’ అని జయలలిత నిప్పులు చెరిగారు. నిత్యం అన్నాడిఎంకెపై బురదజల్లడమే ప్రతిపక్షాల అజెండా అని ఆమె విమర్శించారు. అన్నాడిఎంకె చేపట్టిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమిళనాడు అభివృద్ధిని చూసి ఓర్వలేకే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. అన్నాడిఎంకె సిద్ధాంతకర్త అన్నాదురై బాటలో పయనిస్తూ పార్టీ పటిష్టానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీనికోసం పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు క్షేత్ర స్థాయి నుంచి పాటుపడాలి’ అని జయ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జయ సర్కార్‌పై విమర్శలకు ప్రతిపక్షాలు పదునుపెట్టాయి. ప్రధాన ప్రతిపక్షం డిఎంకెతోపాటు మిగతా విపక్షాలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

‘కొల్లేరు అభివృద్ధికి రూ.110కోట్లు ఇవ్వండి’

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కొల్లేరు వౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికొరకు రూ.110 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు ఏలూరు ఎంపి మాగంటి బాబు అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ కొల్లేరు ప్రజలకు ఏ కమిటీ వల్ల న్యాయం జరగలేదని, తాజాగా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీతోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొల్లేరుపై ఆధారపడి 300 ఏళ్లుగా ఏంతోమంది బతుకుతున్నరని, పక్షులతో పాటు ప్రజలను కాపాడల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టులో కొల్లేరుకు సంబంధించిన కేసు వివాదం నడుస్తోందని, అయితే అక్కడి ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలను కల్పించి వారిని ఆదుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని మాగంటి బాబు స్పష్టం చేశారు.

యుద్ధరంగమంటేనే
అతనికి ఇష్టం
జమ్ము, ఫిబ్రవరి 10: ప్రశాంతమైన పరిస్థితుల్లో పనిచేసే అవకాశం వచ్చినా దేశం కోసం యుద్ధరంగంలో, జటిలమైన పరిస్థితుల్లో పనిచేయడానికే హనుమంతప్ప చొరవ చూపుతుంటారు. ఇది ఆర్మీకి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పిన మాట. హనుమంతప్ప ఇప్పటివరకు తన మొత్తం 13 ఏళ్ల సర్వీసులో పదేళ్లపాటు జటిలమైన ప్రతికూల వాతావరణంలోనే పనిచేశారు. కర్ణాటకకు చెందిన 33 ఏళ్ల హనుమంతప్ప 2002 అక్టోబర్ 25న మద్రాస్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో చేరారు. ఎముకలు కొరికే చలితో కూడిన సియాచిన్ మంచు పర్వతాలలో ఆయన 2015 ఆగస్టు నుంచి విధులు నిర్వహిస్తున్నారు. సియాచిన్‌లోని అత్యంత ఎత్తయిన పోస్టుల్లో ఒకటి, 19,600 అడుగుల ఎత్తున గల పోస్టులో ఆయన 2015 డిసెంబర్ నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తుంటాయి. హనుమంతప్ప 2003 నుంచి 2006 వరకు జమ్మూకాశ్మీర్‌లోని మాహోర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో చురుకుగా పనిచేశారు. తరువాత 2008 నుంచి 2010 వరకు జమ్మూకాశ్మీర్‌లోని 54 రాష్ట్రీయ రైఫిల్స్ (మద్రాస్)లో పనిచేసిన కాలంలోనూ ఆయన ఉగ్రవాదులను వీరోచితంగా ఎదుర్కొన్నారు. 2010 నుంచి 2012 వరకు ఈశాన్య రాష్ట్రాలలోనూ హనుమంతప్ప ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సాహసోపేతంగా పోరాడారు అని ఆ సైనికాధికారి వివరించారు.