అంతర్జాతీయం

హిల్లరీకి మరో ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 10: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు రానురాను రసవత్తరంగా మారుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ నామినీకోసం ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అందరికన్నా ముందున్న మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు బుధవారం న్యూహాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికల్లో చుక్కెదురైంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వంకోసం హిల్లరీతో పోటీ పడుతున్న బెర్నీ శాండర్స్ న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు గత వారం లోవా రాష్ట్రంలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ చేతిలో పరాజయం పాలయిన డొనాల్డ్ ట్రంప్ న్యూహాంపషైర్‌లో విజయం సాధించడం ద్వారా మళ్లీ ఫ్రంట్న్న్రర్‌గా నిలిచారు.
న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఓట్లలో మూడింట ఒక వంతు ఓట్లు లెక్కపెట్టే సమయానికి 74 ఏళ్ల శాండర్స్‌కు 59 శాతం ఓట్లు రాగా హిల్లరీ క్లింటన్‌కు 38 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంకోసం పోటీ పడుతున్న వారిలో 69 ఏళ్ల ట్రంప్ రెండో స్థానంలో ఉన్న ఓహియో గవర్నర్ జాన్ కసిచ్‌కన్నా 18 వేల ఓట్లకు పైగా తిరుగులేని ఆధిక్యత సాధించారు. టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్, ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్, ఫ్లోరిడా సెనేటర్ మార్కో రుబియోసహా పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులు ఇప్పుడు మూడో స్థానంకోసం పోటీ పడుతున్నారు. మూడింట ఒక వంతు ఓట్లను లెక్కించే సమయానికి గత వారం లోవా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన క్రుజ్‌కు 12 శాతం ఓట్లే వచ్చాయి. మరోవైపు బుష్‌కు 11 శాతం ఓట్లు వచ్చాయి.
ఇప్పటివరకు ఒక్కసారి కూడా అధ్యక్ష పదికోసం పోటీ పడని రియల్టీ బిలియనీర్ అయిన ట్రంప్, శాండర్స్‌లు తమ తమ పార్టీల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వంకోసం ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు ఎవరు కూడా ఇంత గట్టి పోటీ ఇస్తారని ఊహించలేదు. ఇప్పుడు వారు సాధించిన విజయాలను బట్టి చూస్తే వృత్తి రాజకీయవేత్తల పట్ల రెండు ప్రధాన పార్టీల్లోను తీవ్రమైన అసంతృప్తి ఉందనే విషయం స్పష్టమవుతూ ఉండడమే కాకుండా అధ్యక్ష అభ్యర్థిత్వంకోసం పోటీ రెండు పార్టీల్లోను చివిరదాకా తేలకపోవచ్చనిపిస్తోందని సిఎన్‌ఎన్ వ్యాఖ్యానించింది.
ఎనిమిదేళ్ల క్రితం అధ్యక్షుడు బరాక్ ఒబామాతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వంకోసం పోటీ పడినప్పుడు హిల్లరీ క్లింటన్ న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలో విజయం సాధించారు. అలాంటిది ఇప్పుడు అదే రాష్ట్రంలో ఒటమి పాలవడం హిల్లరీ క్లింటన్ పెద్ద షాకే. కొద్ది వారాల క్రితం దాకా కూడా అన్ని ఒపీనియన్ పోల్స్‌లోను హిల్లరీ క్లింటన్ శాండర్స్‌పై స్పష్టమైన ఆధిక్యతతో ఉన్నారు. కాగా, తన విజయాన్ని శాండర్స్ రాజకీయ విప్లవంగా అభివర్ణించగా, హిల్లరీ క్లింటన్ ఓటమిని అంగీకరిస్తూనే చివరిదాకా పోరాటాన్ని వదలబోనని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల రంగం సౌత్ కరోలినా రాష్ట్రానికి మారనుంది.