జాతీయ వార్తలు

అసోం వెనుకబాటుకు కాంగ్రెసే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొక్రాజార్, ఫిబ్రవరి 10: కాంగ్రెస్ హయాంలో అసోం అన్ని విధాలుగా నాశనమైందని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఇనే్నళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కేవలం తన కుటుంబాన్ని పెంచిపోషించుకున్నారని అన్నారు. గత పదిహేనేళ్లుగా కాంగ్రెసే అధికారంలో ఉన్నా ఎలాంటి అభివృద్ధి సాధించలేదని, అంతా అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు. ఇందుకు ప్రధాన కారణం తన కుటుంబానికి గొగోయ్ ప్రాధాన్యత ఇవ్వడమేనని రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదని బుధవారం ఇక్కడ జరిగిన బోడో ఒప్పందం దినోత్సవం సందర్భంగా అమిత్ షా అన్నారు. అపారమైన సహజ సంపద, యువశక్తి ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా మిగిలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, బోడోఫ్రంట్ కూటమికి పట్టం కట్టాలని ఆ విధంగా శాంతిని అభివృద్ధిని సాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పదిహేనేళ్ల కాంగ్రెస్ హయాంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, ఒక్క ఏడాదిలోనే 19వేల కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మాతృత్వ, శిశు మరణాలు రేటుకూడా అత్యధిక స్థాయిలోనే ఉందన్న ఆయన ‘తల్లులకు, మహిళలకు రక్షణే లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 9 లక్షల నుంచి 23 లక్షలకు పెరిగిందని పేర్కొన్న ఆయన యువతకు ఉపాధే లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు.

అసోంలోని నాగావ్‌లో బుధవారం నిర్వహించిన బిజెపి ర్యాలీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా