అంతర్జాతీయం

విషం కక్కిన ఫేస్‌బుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఫిబ్రవరి 10: ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌ను భారత్ నిషేధించడాన్ని ఆ సంస్థ బోర్డు మరోసారి తీవ్రంగా మండిపడింది. నిన్న ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకెన్ బర్గ్ ట్రాయ్ నిర్ణయం తనకు తీవ్ర అసంతృప్తి కలిగించందంటూ పరోక్షంగా ఆ నిర్ణయాన్ని దుయ్యబట్టడం తెలిసిందే. కాగా, బుధవారం ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని వలసవాద వ్యతిరేక భావజాలంగా ఆ సంస్థ బోర్డు సభ్యుడు మార్క్ ఆండ్రస్సెన్ అభివర్ణించడమే కాకుండా, భారతదేశం బ్రిటీష్ పాలనలోనే ఉండి ఉంటే బాగుండేదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. భారత టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తీసుకున్న నిర్ణయంపట్ల ఆండ్రస్సెస్, ఆయన సహభాగస్వామి బెనెడిక్ట్ ఇవాన్స్‌లు ఫేస్‌బుక్‌లో తమ ఆగ్రహాన్నంతా వెళ్లగక్కారు. ‘సామ్రాజ్యవాద వ్యతిరేక భావజాలం దశాబ్దాల పాటు భారతీయ ప్రజలకు ఆర్థికంగా పెనువిపత్తుగా ఉంది. దాన్ని ఇప్పుడు ఆపడం ఎందుకు? భారత ప్రభుత్వం తన సొంత ప్రజలపై తీసుకున్న ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమైన అనేక నిర్ణయాల్లో ఇదొకటి’ అని ఆండ్రస్సెస్ ఆ ట్విట్టర్‌లో అన్నారు. ‘్భరత్‌లో నిరుపేదలకు ఇంటర్నెట్ సేవలు లేవు. సైద్ధాంతికపరమైన కారణాల వల్ల ప్రపంచంలోనే అత్యంత నిరుపేదలయిన భారతీయులకు ఉచిత పాక్షిక ఇంటర్నెట్ కనెక్టివిటీని నిషేధించడం నైతికంగా తప్పని నాకు అనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఆండ్రస్సెస్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఆండ్రీస్సెన్ హోరోవిజ్’లో ఆయన భాగస్వామి అయిన ఇవాన్స్ కూడా ట్రాయ్ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. అయితే వీరి వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డంతో ఆండ్రస్సెస్ తన ట్వీట్‌ను ఉపసంహరించుకోవడమే కాకుండా ఇకపై భారతీయ ఆర్థిక, రాజకీయ విధానాలపై ఎలాంటి చర్చలోను పాల్గొనబోనని కూడా స్పష్టం చేశారు.