జాతీయ వార్తలు

హనుమంతప్ప కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సియాచిన్‌లో టన్నుల కొద్దీ మంచుకింద కూరుకు పోయిన అయిదు రోజుల తర్వాత కొన ప్రాణాలతో బైటపడిన లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ గురువారం ఇక్కడి ఆర్మీ రిసెర్చ్, రెఫరల్ ఆస్పత్రిలో మృతి చెందారు. లాన్స్‌నాయక్ హనుమంతప్ప ఇక లేరు. ఈ రోజు తెల్లవారుజామున 1.45 గంటలకు ఆయన చివరి శ్వాస విడిచారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మద్రాసు రెజిమెంట్‌కు చెందిన 19వ బెటాలియన్‌లో పని చేస్తున్న 33 ఏళ్ల హనుమంతప్పకు భార్య మహదేవి అశోక్ బిలెబాల్, రెండేళ్ల కమార్తె నేత్ర కొప్పాడ్ ఉన్నారు. కర్నాటక రాష్ట్రం ధార్వాడ్ జిల్లా బెతదూర్ గ్రామానికి చెందిన హనుమంతప్ప 13 ఏళ్ల క్రితం సైన్యంలో చేరారు. సియాచిన్‌లో సంభవించిన మంచు తుపాను కారణంగా టన్నుల కొద్దీ మంచు కింద కూరుకుపోయినప్పటికీ హనుమంతప్ప ఆరు రోజుల పాటు జీవించి ఉన్న విషయం తెలిసిందే. రక్త నాళాలన్నీ గడ్డ కట్టుకు పోయి కోమాలోకి చేరుకున్న హనుమంతప్పను ఈ నెల 9న ఇక్కడి ఆర్మీ రిసెర్చ్, రెఫరల్ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ఆర్మీ ఆస్పత్రి, వైద్య శాఖ హెడ్‌ఫ్‌ది డిపార్ట్‌మెంట్‌కు చెందిన పలువురు వైద్య నిపుణులు, అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్)కు చెందిన నిపుణులతో కూడిన బృందం బుధవారం హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది.
ప్రధాని, సోనియా సంతాపం
కాగా, లాన్స్‌నాయక్ హనుమంతప్ప మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హనుమంతప్ప మృతి మనందరినీ తీవ్రమైన ఆవేదనకు గురి చేసిందని, భౌతికంగా ఆయన మనకు దూరమైనప్పటికీ, ఆయనలోని సైనికుడు ఎప్పటికీ నిలిచే ఉంటాడనిని మోదీ ట్విట్టర్‌లో ఉంచిన సంతాప సందేశంలో మోదీ పేర్కొన్నారు. మీలాంటి అమరవీరులు భారత దేశానికి సేవ చేసినందుకు గర్విస్తున్నానని కూడా ఆయన ఆ ట్వీట్‌లో అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హనుమంతప్ప మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ప్రాణాలతో ఉన్నప్పుడు ఆయన కోలుకోవాలని దేశంలో ప్రతి ఒక్కరూ ప్రార్థించారని, ఇప్పుడు ఆయన కోసం ప్రతి ఒక్కరూ విలపిస్తున్నారని సోనియా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. హనుమంతప్ప కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

చిత్రం... వీర సైనికుడు హనుమంతప్ప పార్థివ దేహం వద్ద
నివాళి అర్పిస్తున్న రక్షణ మంత్రి పారికర్
హనుమంతప్ప (ఫైల్ ఫొటో)