జాతీయ వార్తలు

ఏటా రెండుసార్లు ఓటర్లుగా నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలోని యువత ఇక ఏటా రెండుసార్లు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు జనవరి 1 అలాగే జూలై 1న ఓటర్లు నమోదుకావడానికి కటాఫ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పటి వరకూ జనవరి 1 మాత్రమే ఉండేది. ఇక నుంచి జూలై 1వ తారీఖుతో 18 ఏళ్లు నిండినవారు ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చు. యువతను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇసి వెల్లడించింది. నాలుగు కట్‌ఆఫ్ తేదీలు నిర్ణయించాలని ఇసి ప్రతిపాదించగా ప్రభుత్వం రెండు కటాఫ్‌లే ఉంచడానికి ప్రభుత్వం అంగీరించింది. గత వారం న్యాయశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

ఎంపీల జీతభత్యాలు రెట్టింపు చేయండి

ప్రభుత్వానికి పార్లమెంటు కమిటీ సలహా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: పార్లమెంటు సభ్యుల జీత భత్యాలను రెట్టింపు చేయాలన్న కేంధ్రం ప్రతిపాదనను సత్వరం అమలు చేయాలని దీనికి సంబంధించిన పార్లమెంటు కమిటీలోని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించే ఏ కమిటీ నివేదిక అయినా తమ ద్వారానే వెళ్లాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఎంపీల వేతనాలు, అలవెన్సుల సమీక్షకోసం ప్రభుత్వం నియమించే ఏ స్వతంత్ర కమిటీ నివేదిక అయినా సరే పార్లమెంటు ద్వారా అధికారాలు సంక్రమించిన తమ కమిటీ ద్వారానే వెళ్లాలని బుధవారం జరిగిన పార్లమెంటు సభ్యుల జీత భత్యాలపై ఏర్పాటయిన సంయుక్త కమిటీ సమావేశంలో పలువురు సభ్యులు అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ముందు కమిటీ ఆ నివేదికను తమద్వారా పంపాలని వారు అభిప్రాయ పడ్డారు. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను నిర్ణయించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించాలని కేంద్రం గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం నిర్ణయించడం, ఆ నెల 29, 30 తేదీల్లో జరిగిన అఖిల భారత విప్‌ల సమావేశం దానికి ఆమోదం తెలపడం తెలిసిందే. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను రెట్టింపు చేయాలని సంయుక్త పార్లమెంటరీ కమిటీ గత ఏడాది జూన్‌లో సిఫార్సు చేయడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలోఈ ప్రతిపాదన రావడం గమనార్హం. ఎంపీల జీతభత్యాలను సమీక్షించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను లేదా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి ఎంపి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని సంయుక్త కమిటీ గత ఏడాది మే, జూలై నెలల్లో జరిగిన సమావేశాల్లో అభిప్రాయ పడిన విషయం తెలిసిందే. జీతాలు పెంచే విషయాన్ని పరిశీలించేటప్పుడు ప్రభుత్వ అధికారుల వేతనాల పెంపును దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఆ కమిటీ సూచించింది.ఈ ప్రతిపాదనను తమ ముందుంచాలని కమిటీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. కాగా, ఎంపీల జీతాలు రెట్టింపునకు సంమందించి తమ మంత్రిత్వ శాఖ ఒక కేబినెట్ నోట్‌ను తయారు చేస్తోందని ఆ శాఖ అధికారులు బుధవారం కమిటీకి తెలియజేశారు.ఈ కేంద్ర బడ్జెట్‌లోనే ఇది వాస్తవరూపం దాల్చడానికి వీలుగా వీలయినంత త్వరగా ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ముందుంచాలని కమిటీ సభ్యులు వారిని ఆదేశించారు.