జాతీయ వార్తలు

ఫిరాయింపులపై స్పీకర్‌దే తుది అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే అంశాలపై గవర్నర్‌కు ఎలాంటి అధికారం ఉండదని, అసెంబ్లీ స్పీకర్‌దే తుది నిర్ణయం అవుతుందని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర గవర్నర్ రాజ్‌ఖోవా ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీం కోర్టు ‘అసెంబ్లీలో పార్టీల బలాబలాలకు ఎట్టి పరిస్థితుల్లో విఘాతం కలిగించడానికి వీల్లేదు’అని తెలిపింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే రాజ్యాంగ అధికారం స్పీకర్‌దేనని, ఈ అధికారాన్ని గవర్నర్ ఎలా చేజిక్కించుకుంటారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అసెంబ్లీ పనితీరు విషయంలో గవర్నర్‌కు కొంత పాత్ర ఉండవచ్చునేమో గానీ, పదో షెడ్యూలు (్ఫరాయింపు నిరోధక నిబంధన) విషయంలో మాత్రం ఆయనకు ఎలాంటి అధికారం ఉండదని తేల్చిచెప్పింది.మైనార్టీ కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకే 16మంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన సమయంలోనే గవర్నర్ రాజ్‌ఖోవా ఆదేశం వెలువడింది.