జాతీయ వార్తలు

జెఎన్‌యులో రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌ను సందర్శించి అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. దేశద్రోహం ఆరోపణలపై జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యా కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన ఒకరోజు తర్వాత రాహుల్ జెఎన్‌యు క్యాంపస్‌ను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించడం గమనార్హం. ఈ సందర్భంగా రాహుల్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, విద్యాసంస్థలో విద్యార్థుల గొంతు నొక్కేవారే అందరికన్నా పెద్ద దేశ ద్రోహులన్నారు. ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మతో కలిసి క్యాంపస్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ అక్కడి విద్యార్థులతో మాట్లాడుతూ యూనివర్శిటీ వాక్స్వాతంత్య్రానికి ప్రతీకగా ఉందంటూ ప్రశంసించారు. హైదరాబాద్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులకు, జెఎన్‌యులో జరుగుతున్న సంఘటనలకు దగ్గరి పోలికలున్నాయని అంటూ, ఒ విద్యార్థి తాను నమ్మిన దాన్ని చెప్పడానికి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఎక్కువమంది తమ వాణిని వినిపిస్తూ ఉన్నందునే దేశం పురోగమిస్తోందని అంటూ, తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. రోహిత్ ఆత్మహత్య ఉదంతాన్ని పదేపదే ప్రస్తావించిన రాహుల్, ఈ అంశంపై ప్రభుత్వం ప్రధానంగా మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ తీరును దుయ్యబట్టారు. కాగా, రాహుల్ ప్రసంగానికి కొంతమంది విద్యార్థులు పదేపదే అడ్డుతగులుతూ ‘రాహుల్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి వాళ్లు చెప్పే అభిప్రాయాలను కూడా తాము గౌరవిస్తామని రాహుల్ అన్నారు. ‘మా ముందే కాదు, మా వెనక మాట్లాడేవారిని కూడా మేము గౌరవిస్తాం’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, జెడి (యు) అధికార ప్రతినిధి కెసి త్యాగి శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి పోలీసులు అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయా కుమార్‌ను విడుదల చేయాలని కోరారు. రాజ్‌నాథ్‌ను కలిసిన అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ, తాము హోంమంత్రిని కలిసి యూనివర్శిటీలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని వివరించామని చెప్పారు. జెఎన్‌యులో జరిగిన సంఘటనలకు సంబంధించి పోలీసులు 20మంది పేర్లను విడుదల చేశారని, వారిలో రాజా కుమార్తె కూడా ఉందని ఏచూరి అంటూ, వారు నినాదాలు చేయడాన్ని పోలీసులు వీడియోలో చూశారా? అని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. అనంతరం వారు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్‌ను కూడా కలిసి సంఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జెఎన్‌యు చాన్సలర్ కె కస్తూరిరంగన్ శనివారం యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. మరోవైపు యూనివర్శిటీలో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయడానికి అనుమతించిన తీరుపట్ల నిరసన తెలియజేస్తూ యూనివర్శిటీకి చెందిన నలుగురు డీన్‌లు వైస్‌చాన్సలర్ జగదీశ్ కుమార్‌కు ఒక లేఖ రాశారు. ఇదిలాఉండగా, యూనివర్శిటీలో జరిగిన సంఘటనపై కేద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ వర్శిటీనుంచి స్థారుూ నివేదికను కోరింది. మరోపక్క, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఢిల్లీ పోలీస్ కమిషన్ బిఎస్ బస్సీ జెఎన్‌యు కేసు దర్యాప్తు పురోగతిని వివరించారు.
chitram...

జెఎన్‌యు విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ