జాతీయ వార్తలు

హామీల మాటేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విభజన చట్టం హామీల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభ స్థానాలు పెంపు బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు కేంద్ర హోంమంత్రి రాజన్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం మధ్యాహ్నం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిసి, విభజన చట్టం హామీలను గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు, తెలంగాణకు అవసరమైనంత ఐపీఎస్ అధికారుల కేటాయింపు, హై కోర్టు విభజన అంశాలను చర్చించారు. కెసిఆర్ ప్రస్తావించిన అన్ని అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. రాజ్‌నాథ్, కెసిఆర్‌ల చర్చల సారాంశాన్ని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి వేణగోపాలచారి మీడియాకు వెల్లడించారు. తెలంగాణాలో తక్కువమంది ఐపీఎస్‌లు ఉండటంవల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని హోంమంత్రికి కెసిఆర్ వివరించారు. ఐపీఎస్‌ల కొరతవలన పాలనకు ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలు తొలగిపోవాలంటే సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై ఇద్దరు సిఎంల మధ్య ఏకాభిప్రాయం ఉన్నందున విభజన చట్టానికి అవసరమైన సవరణలు చేయాలని కెసిఆర్ కోరారు. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించాలని రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావు, లోక్‌సభలో తెరాస పక్షం నేత జితేందర్ రెడ్డి, ఎంపీ బి వివోద్‌కుమార్‌లు రెండు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపకంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యతో చర్చించటాన్ని హోంమంత్రి దృష్టికి తెచ్చారు. వెంకయ్యనాయుడు ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖతో చర్చించిన విషయాన్ని వేణుగోపాలచారి ప్రస్తావిస్తూ, రాజ్‌నాథ్‌ను వెంకయ్యనాయుడు కలిసి బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించటంపై చర్చిస్తారని వేణుగోపాలచారి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని ఐపీఎస్ అధికారులు తెలంగాణకు డిప్యుటేషన్‌పై వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కెసిఆర్ చేసిన విజ్ఞప్తిని రాజ్‌నాథ్ సూత్రప్రాయంగా అంగీకరించారని వెల్లడించారు.
ఠాకూర్‌తో కెసిఆర్
సిఎం కెసిఆర్ శనివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్‌ను కలిసి రాష్ట్ర హైకోర్టు విభజనపై చర్చించినట్టు తెలిసింది. విభజన జరిగి 19 నెలలు కావస్తున్నా, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కాకపోవటంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయని సిఎం వివరించారని అంటున్నారు. ఆంధ్ర హైకోర్టు ఏర్పాటు కోసం భవనం కేటాయించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిజేకు కెసిఆర్ వివరించినట్టు తెలిసింది.
chitram...
కేంద్ర హోంమంత్రి రాజన్‌నాథ్ సింగ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సిఎం కె చంద్రశేఖర్ రావు