జాతీయ వార్తలు

నోరు జారొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు ఆచితూచి మాట్లాడాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద అంశాల జోలికి వెళ్లొద్దని బిజెపి అధినాయకత్వం పార్టీ ఎంపీలకు హితవు చెప్పింది. అసహనం సాకుతో ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ సభ్యులు బాధ్యతతో మెలగాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో బిజెపి పార్లమెంటరీ పార్టీ భేటీ ఇక్కడ జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. సభలో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా సభ్యులు, మంత్రులు సంయమనం పాటించాలని అన్నారు. సమావేశానంతరం పార్లమెంటు వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఎన్నికలు, తాజా రాజకీయాలపై సమీక్షించినట్టు వెల్లడించారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తుంటే విపక్షాలు సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని వెంకయ్య ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ గత త్రైమాసికంలో దేశంలో ఆర్థిక వృద్ధిరేటు 7.4గా ఉందని స్పష్టం చేశారు. వృద్ధి సంకేతాలు పురోగతిన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు పేదలకు చేరువకానున్నాయని అన్నారు. ‘సభా నియమ నిబంధనలు సభ్యులు ఆకళింపుచేసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. అదే సమయంలో ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్లాలి’ అని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. మోదీ అభివృద్ధి అజెండా చూసి ఓర్వలేక విపక్షాలు సభను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ‘మనం రెచ్చగొట్టే ప్రసంగాలకు దూరంగా ఉందాం’ అని నఖ్వీ స్పష్టం చేశారు. ప్రధాన మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు సభాకార్యక్రమాలు అర్థవంతంగా సాగేందుకు కృషి చేద్దామని నిర్ణయించుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, బిల్లుల ఆమోదం ముఖ్యమంగా జిఎస్‌టిపై ఆ సమావేశంలో చర్చించినట్టు ఆయన తెలిపారు.
పలు రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయంపై బిజెపి ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేశారని నఖ్వీ పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల పరాజయం విషయమై అడగ్గా ‘ప్రజల తీర్పును మేం గౌరవిస్తాం. వారి తీర్పును శిరసావహిస్తాం’ అని బదులిచ్చారు.
chitram..
బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రులు వెంకయ్య, అరుణ్ జైట్లీ