జాతీయ వార్తలు

అమెరికా నిర్ణయంపై భారత్ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని అమెరికా తీసుకున్న నిర్ణయం పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్ శనివారం భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మను శనివారం ఇక్కడి సౌత్ బ్లాక్ కార్యాలయానికి పిలిపించి తమ అసంతృప్తిని, నిరసనను వ్యక్తం చేశారు. అమెరికా పాకిస్తాన్‌కు సైనిక సహాయం చేయడం పట్ల భారత్‌కు ఉన్న ఆందోళనను తెలిపారు. అమెరికా పాకిస్తాన్‌కు అందించే సైనిక సహాయం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని తమ దేశం గట్టిగా విశ్వసిస్తున్నట్లు జైశంకర్ అమెరికా రాయబారికి వివరించారు. అమెరికా నిర్ణయం పట్ల భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా శనివారం ఒక ప్రకటనలో తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేసింది. అమెరికా పాకిస్తాన్‌కు సరఫరా చేసే ఈ యుద్ధ విమానాలు, ఆయుధాలు ఉగ్రవాదంపై యుద్ధానికి ఉపయోగపడతాయనే అమెరికా వాదనతో తాము ఏకీభవించడం లేదని, ఈ వాదనలో ఎలాంటి సహేతుకత లేదని ఆ ప్రకటనలో పేర్కొంది. గత చాలా ఏళ్ల చరిత్ర భారత్ వాదనను నిరూపిస్తోందని తెలిపింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం గల ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు విక్రయించాలని నిర్ణయించినట్లు అంతకు ముందు ఒబామా పాలనా యంత్రాంగం తెలిపింది. వీటి విలువ సుమారు 700 మిలియన్ల డాలర్లు ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్ ముందు ఉంచింది. దీనిపై కాంగ్రెస్ 30 రోజులలోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మోదీ సాధించిన ఏకైక
విజయమిది: కాంగ్రెస్ ఎద్దేవా
అమెరికా నిర్ణయం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. మోదీ ప్రభు త్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రశ్నించింది. అమెరికా, రష్యా లు రెండు కూడా పాకిస్తాన్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారులుగా అవతరించాయని, భారత విదేశాంగ విధానంలో మోదీ సాధించిన ఏకైక విజయమిదేనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారి శనివారం ఇక్కడ ఎద్దేవా చేశారు.