జాతీయ వార్తలు

పొత్తు కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిపోటీచేయాలని డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ డిఎంకె అధినేత ఎం కరుణానిధితో సమావేశమై ఎన్నికల పొత్తుపై తమ అంగీకారం తెలిపారు. లంకలో తమిళుల అంశంపై మూడేళ్ల క్రితం రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ‘మా కేంద్ర నాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకెతో కలిసి నడవాలని నిర్ణయించింది. తమిళనాడులో కరుణానిధి తిరుగులేని నాయకుడు. మా రెండు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి’ అని ఆజాద్ గోపాలపురంలోని డిఎంకె అధినేత నివాసం వద్ద మీడియాకు స్పష్టం చేశారు. కరుణానిధి ఎంతో పరిణతి చెందిన, గౌరవనీయమైన అధినాయకుడని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్ ప్రశసించారు.
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల దగ్గరనుంచి కరుణతో కాంగ్రెస్‌కు మంచి సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. కరుణానిధి కాంగ్రెస్‌కు ఎంతో విశ్వసనీయమైన నాయకుడని ఆయన స్పష్టం చేశారు. 2013నుంచి డిఎంకెకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్‌కు 2016కి ఆ పార్టీలో ఏ మార్పును చూశారని మీడియా ప్రశ్నించగా ‘రాజకీయాలన్నాక కొన్ని వత్తిళ్లు ఉంటాయి’ అని బదులిచ్చారు. ఇది తమకు కొత్తకాదని ఆయన అన్నారు. చాలా సందర్భాల్లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయని ఆజాద్ గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో డిఎంకె నాయకత్వంలోని కూటమి ఘనవిజయం సాధిస్తుందని కాంగ్రెస్ నేత జోస్యం చెప్పారు. కాంగ్రెస్, డిఎంకె భావసారుప్యతగల పార్టీలను కలుపుకొని వెళ్తాయని ఆయన వెల్లడించారు. యుపిఏ భాగస్వామపక్షంగా ఉన్న డిఎంకె 2013లో లంక యుద్ధనేరాలపై ఐరాసలో తీర్మానానికి పట్టుబట్టాలని డిమాండ్ చేసింది. దీనికి కాంగ్రెస్ నుంచి సానుకూలత లేకపోవడంతో ఇరుపార్టీల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.