జాతీయ వార్తలు

మా డిగ్రీలు వెనక్కిచ్చేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ డిగ్రీ పట్టాలు వెనక్కి ఇచ్చేస్తామంటూ మాజీ సైనికులు ప్రకటించారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పార్లమెంటుపై దాడి కేసులో ఉగ్రవాది అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వుండాలని మాజీ సైనిక ఉద్యోగులు డిమాండ్ చేశారు. ‘విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో జాతి వ్యతిరేక కార్యకలాపాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉగ్రవాది అఫ్జల్‌గురును ఉరితీసిన రోజు ఓ దినోత్సవంగా జరుపుకోవడం గర్హనీయం. ఇలాంటి శక్తులను ఉపేక్షించవద్దు’ అంటూ 54 ఎన్‌డిఏ కోర్సు చేసిన మాజీ సైనిక ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారంతా జెఎన్‌యు వైస్‌చాన్సలర్ జగదీశ్‌కుమార్‌కు లేఖ రాశారు. ‘వర్శిటీలో ప్రస్తుత పరిస్థితులు మమ్మల్ని ఎంతో బాధిస్తున్నాయి. జాతి వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో వర్శిటీలో మేం చేసిన డిగ్రీ పట్టాలు తిరిగి ఇచ్చేస్తాం’ అని ఆ లేఖలో అల్టిమేటం ఇచ్చారు. జాతి వ్యతిరేక ప్రదర్శనలు ఇచ్చినవారికి బిజెపి యేతర పార్టీలు వత్తాసుపలకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.