జాతీయ వార్తలు

సామాన్యులకు చేరువగా కళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కళలు కాలానికి, కులం, మతం, ప్రాంతాలకు అతీతమైనవని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, కళలను సామాన్యులకు చేరువగా తీసుకురావాలని, స్వచ్ఛ్భారత్‌లాంటి అంశాలపై సామాజిక సందేశాలను వ్యాప్తి చేయడానికి వాటిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం ముంబయి శివార్లలోని బాంద్రాలో బాంబే ఆర్ట్ సొసైటీకి చెందిన నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, కళ అనేది ధనవంతుల నాలుగు గోడలకు పరిమితం కాకూడదని, సమాజానికి ఉపయోగపడే శక్తిగా మారాలని అన్నారు. కళాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి రైల్వే ప్లాట్‌ఫారాలపై ఖాళీగా ఉండే స్థలాలను ఉపయోగించుకోవాలని ప్రధాని సూచించారు. అంతేకాకుండా సామాజిక సందేశాలను వ్యాప్తి చేయడానికి కూడా కళలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రసంగాలకన్నా కూడా ఏ కళ అయినా జనాల హృదయాలను బలంగా తాకుతుందని అంటూ, పారిశుద్ధ్యం, శానిటేషన్ లాంటి అంశాలపై రూపొందించే ఏ కళ అయినా ప్రజలపై ప్రభావం చూపిస్తుందన్నారు. కళలు ప్రోత్సాహం, నిధులకోసం ప్రభుత్వంపై ఆధారపడకూడదని ప్రధాని అంటూ, అయితే ప్రభుత్వం కళలను గౌరవించి తీరాలన్నారు. కళాకారులు స్వచ్ఛ భారత్ కోసం తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని, తమ చిత్రాల ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్ల మొత్తం స్వరూపానే్న మార్చి వేశారని తాను ఇంతకుముందు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో చెప్పిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక కళాఖండం ఎలా సృష్టింబడుతుందో భావి తరాలు తెలుసుకోవడం కోసం కళాఖండాల డిజిటల్ వెర్షన్‌ను అభివృద్ధి చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, బాంబే ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు వాసుదేవ్ కామత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

chitram...

ముంబయి శివార్లలోని బాంద్రాలో శనివారం బాంబే ఆర్ట్ సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు

బాంబే ఆర్ట్ సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం, అందులోని కళాఖండాలను తిలకిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ