జాతీయ వార్తలు

ఇపిఎఫ్ వడ్డీరేటు 8.8 శాతానికి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) తమ చందాదారులకు తీపికబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) డిపాజిట్లకు చెల్లించే వడ్డీ రేటును 8.8 శాతానికి పెంచుతున్నట్లు మంగళవారం ఇపిఎఫ్‌ఓ ప్రకటించింది. పిఎఫ్ డిపాజిట్లపై గత రెండేళ్లు చెల్లించిన 8.75 శాతం వడ్డీ కంటే ఇది 0.13 శాతం ఎక్కువ. దీని వలన దేశంలోని 6 కోట్ల మందికిపైగా ఇపిఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
స్వల్పకాలిక పోస్ట్ఫాసు
డిపాజిట్లపై వడ్డీ తగ్గింపు
ఇదిలావుంటే, చిన్న తరహా పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉంచాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక పోస్ట్ఫీసు డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లను మంగళవారం 0.25 శాతం మేరకు తగ్గించింది. అయితే సీనియర్ సిటిజన్లు, బాలికలకు సంబంధించిన పొదుపు పథకాలతో పాటు నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) వంటి దీర్ఘకాలిక పొదుపు పథకాల వడ్డీ రేట్లను మాత్రం ప్రభుత్వం యథాతథంగానే ఉంచింది. ఒకటి నుంచి మూడేళ్ల వరకు కాల పరిమితి కలిగిన ప్రభుత్వ సెక్యూరిటీల కంటే ఇంతే కాల పరిమితి కలిగిన పోస్ట్ఫాసు పొదుపు డిపాజిట్లు, కిసాన్ వికాస్ పత్రాల (కెవిపి)తో పాటు ఐదేళ్ల కాల పరిమితి కలిగిన రికరింగ్ డిపాజిట్లపై ఇప్పటివరకూ 0.25 శాతం అధిక వడ్డీ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ అదనపు వడ్డీని ఉపసంహరిస్తున్నామని, అంతేకాకుండా ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సవరించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.