జాతీయ వార్తలు

ముమ్మాటికీ దేశ ద్రోహమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: జెఎన్‌యులో వివాదం సృష్టించిన కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని ప్రభుత్వంపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. దేశం ఉనికిని ప్రశ్నించడం అన్నది దేశ ద్రోహం కిందకే వస్తుందని మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఇక్కడో ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్యతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొన్ని పార్టీలు పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నాయని పిఎంఓ ఆఫీసు సహాయ మంత్రి సింగ్ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులను పావుగా ఉపయోగించుకుని వివాదాలు సృష్టిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. జెఎన్‌యు కార్యక్రమానికి లష్కరే తొయిబా చీఫ్ హాఫీజ్ సరుూద్ మద్దతు ఉందని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వాఖ్యలు జితేంద్ర సింగ్ దృష్టికి తీసుకురాగా ‘ఆయనాప్రకటన చేశాకే జరిగిందేమిటో తెలిసింది’ అని అన్నారు. జెఎన్‌యులో అఫ్జల్‌గురు సంస్మరణ కార్యక్రమానికి హఫీజ్ మద్దతు ఉందని ఆదివారం రాజ్‌నాథ్ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
జెఎన్‌యు విద్యార్థులకు
అంతర్జాతీయ విద్యావేత్తల మద్దతు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: వివాదంతో అట్టుడుకుతున్న జెఎన్‌యు క్యాంపస్‌లో విద్యార్థులు సాగిస్తున్న ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నట్లు అంతర్జాతీయ యూనివర్శిటీలకు చెందిన 455 మంది విద్యావేత్తలు సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. కొలంబియా, యేల్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ తదితర ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు వీరిలో ఉన్నారు. ఎంతో ఉన్నతమైన జెఎన్‌యు విమర్శనాత్మక ఆలోచనలకు, ప్రజాస్వామిక అసమ్మతికి, విద్యార్థుల చైతన్యానికి, భిన్నమైన రాజకీయ అభిప్రాయాలకు వేదికగా ఉందని, ఇది కేవలం భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఇదే విధమైన పరిస్థితి ఉందని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం జెఎన్‌యులో విద్యార్థుల గొంతు నొక్కేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అధ్యాపకులుగా తాము ఈ పరిణామాలను వౌనంగా చూస్తూ ఊరుకోలేమని వారు స్పష్టం చేశారు.