జాతీయ వార్తలు

‘జాతీయవాదం’ గురించి విద్యార్థులకు బోధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశద్రోహ కేసులో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘ (జెఎన్‌యుఎస్‌యు) నాయకుడు కన్హయ్య కుమార్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆ వర్శిటీ అధ్యాపకులు మంగళవారం తరగతులను బహిష్కరించి విద్యార్థుల సమ్మెలో పాల్గొన్నారు. అంతేకాకుండా ‘జాతీయవాదం’పై ఇకమీదట వర్శిటీ ఆవరణలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. కన్హయ్య కుమార్‌పై దేశద్రోహ కేసును ఉపసంహరించి అతడిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జెఎన్‌యు విద్యార్థులు సోమవారం నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కన్హయ్యను సోమవారం న్యూఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తుండగా అక్కడ పది మంది అధ్యాపకులతో పాటు విద్యార్థి బృందంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో తరగతులను బహిష్కరించి విద్యార్థులతో చేతులు కలపాలని అధ్యాపకుల సంఘం నిర్ణయించింది. ‘జెఎన్‌యు పాలనా యంత్రాంగం కేవలం విద్యార్థుల విషయంలోనే కాకుండా మా పట్ల కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మాపై బాహాటంగా దాడి జరిగితే వర్శిటీ వైస్ చాన్సలర్ నోరు మెదపలేదు. దేశ వ్యతిరేక శక్తులకు జెఎన్‌యు నెలవుగా మారిందని ప్రపంచమంతా భావిస్తోంది.
అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు సాగిస్తున్న దుష్ప్రచారమే ఇందుకు కారణం. కనుక జాతీయవాదం అంటే ఏమిటో మా విద్యార్థులకు బోధించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని సోమవారం దాడిలో గాయపడిన రోహిత్ ఆజాద్ అనే అధ్యాపకుడు తెలిపారు.

అరుణాచల్‌లో
స్టేటస్‌కోకు ‘నో’
సుప్రీంలో కాంగ్రెస్‌కు నిరాశ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో యథాతధస్థితి (స్టేటస్‌కో)కు ఆదేశించాలంటూ కాంగ్రెస్ దాఖలుచేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సోమవారం కాంగ్రెస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధింపు అంశాన్ని ప్రస్తావించారు. సీనియర్ న్యాయవాదులు ఎఫ్‌ఎస్ నారిమన్, కపిల్ సిబాల్ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకీ తరఫున పిటిషన్ వేశారు. కొత్త ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాలని సుప్రీంను కోరారు. రాష్టప్రతి పాలన ఎత్తివేసేలా గవర్నర్ జెపి రాజ్‌ఖోవాకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో తాజాగా పిటిషన్ దాఖలు చేసినట్టు నారిమన్ వెల్లడించారు.