అంతర్జాతీయం

అమెరికా సుప్రీంకోర్టు జడ్జి పదవికి ముగ్గురు భారతీయుల మధ్య పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా సుప్రీంకోర్టు జడ్జి ఆంటోనిన్ స్కాలియా ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానంలో జడ్జీగా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేయాలని అనుకుంటున్న వారిలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు అమెరికన్లు ఉన్నట్లు తెలుస్తోంది. టెక్సాస్‌లో స్కాలియా మృతిచెందిన కొద్ది గంటలకే ఆ ఖాళీలో నియమించబోయే వారి పేర్లలో చండీగఢ్‌లో జన్మించిన శ్రీ శ్రీనివాసన్ పేరు ప్రముఖంగా వినిపించింది. 48 ఏళ్ల శ్రీనివాసన్ ప్రస్తుతం అమెరికా కోర్ట్ ఆఫ్ అపీల్స్‌లో కొలంబియా జిల్లా సర్క్యూట్‌కు సర్క్యూట్ జడ్జిగా పని చేస్తున్నారు. ఒబామా గతంలో అమెరికాలోని వివిధ కోర్టులకు పలువురు భారతీయ అమెరికన్లను నామినేట్ చేయడమేకాక, వారిలో కొంతమందిని వ్యక్తిగతంగా కూడా ప్రశంసించడాన్ని బట్టి చూసినట్లయితే ఆయన జాబితాలో శ్రీనివాసన్‌తో పాటు మరికొంతమంది భారతీయ అమెరికన్ల పేర్లు కూడా ఉంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. శ్రీనివాసన్‌తోపాటుగా ఒబామా సొంత ఊరికే చెందిన 2010 మే నుంచి 2011 జూన్ వరకు అమెరికా తాత్కాలిక సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన నీల్ కాత్యాల్, ఒబామాకు అత్యంత సన్నిహితురాలిగా భావిస్తున్న కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్‌ల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని చెన్నైలో మూలాలున్న హారిస్ ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సెనేట్ స్థానానికి పోటీ పడుతోంది.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొన్న ఆరుమంది పేర్లలో హారిస్ పేరు కూడా ఉంది. అయితే ఆమె మాత్రం ఈ ఊహాగానాలపై స్పందించలేదు.