జాతీయ వార్తలు

అరుణాచల్‌లో రాష్టప్రతి పాలన ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనను తొలగించాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం సిఫార్సు చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్‌ను నియంత్రించలేమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అరుణాచల్ ప్రదేశ్‌పై చర్చించారు. అనంతరం రాష్టప్రతి పాలనను తొలగించాలంటూ సిఫార్సు చేశారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న కొన్నిగంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు అరుణాచల్‌పై తాజా ఉత్తర్వులను జారీచేసింది. తమవద్దనున్న రికార్డులన్నింటినీ పరిశీలించి తీర్పును వెలువరించే వరకు రాష్ట్రంలో యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. 14మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ మాజీ స్పీకర్ నవం రెబియా తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు పరిశీలిస్తోంది. కొత్త ప్రభుత్వం చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్ర గవర్నర్ జెపి రాజ్‌కోవాను నియంత్రించాలన్న తమ అభ్యర్థనలు తేలే వరకు యథాతథ స్థితినే కొనసాగించాలని సీనియర్ లాయర్లు ఎఫ్.ఎస్.నారిమన్, కపిల్ సిబల్‌లు వాదించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ తాత్కాలిక ఉత్తర్వులను జారీచేసింది. ఈ అభ్యర్థనపై మంగళవారం జరిగిన విచారణలో ఎలాంటి పురోగతి సాధ్యం కాని నేపథ్యంలో... కనీసం వీటిని తేల్చే వరకైనా అరుణాచల్‌లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. గురువారంకల్లా ఎమ్మెల్యేల అనర్హతలకు సంబంధించిన అన్ని రికార్డులను తమకు అందించాలని రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అలాగే గౌహతి హైకోర్టు రిజిస్ట్రీని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. వీరి అనర్హతలకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను కేసు విచారణలో భాగంగా లోతుగా పరిశీలించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు తేలే వరకూ ఇందుకు సంబంధించిన కక్ష్యదారులందరూ యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. అరుణాచల్‌లో రాష్టప్రతి పాలన ఎత్తివేయాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కపిల్ సిబల్, నారిమన్‌లు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ తాజా ఉత్తర్వు జారీ అయింది.